ఎన్‌జీకే మూవీ రివ్యూ

Last Updated on by

నటీనటులు : సూర్య‌, ర‌కుల్ ప్రీత్, సాయి ప‌ల్ల‌వి త‌దిత‌రులు..
బ్యానర్: డ‌్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్
నిర్మాత: ఎస్‌.ఆర్‌.ప్ర‌భు (త‌మిళ్), కె.కె.రాధామోహ‌న్ (తెలుగు)
సంగీతం: యువ‌న్ శంక‌ర రాజా
రచన- దర్శకత్వం: సెల్వ రాఘ‌వ‌న్

ముందు మాట:
ఎన్‌జీకే అంటూ `సూర్య – సెల్వ రాఘ‌వ‌న్` జోడీ ఏదో కొత్త‌గా ట్రై చేస్తున్నార‌ని ఏడాదిన్న‌ర‌గా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. రాజ‌కీయాలు వేడెక్కిస్తున్న ఈ సీజ‌న్ లో ఓ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ తో వ‌స్తున్నామ‌ని అన‌గానే ఒక‌టే ఉత్కంఠ పెరిగింది. అందుకు త‌గ్గ‌ట్టే చెగువెరా గెట‌ప్ తో నంద గోపాల్ కృష్ణ (ఎన్‌జీకే) స‌ర్ ప్రైజ్ చేశాడు. ర‌కుల్- సాయి ప‌ల్ల‌వి క‌థానాయిక‌లుగా న‌టిస్తుండ‌డంతో గ్లామ‌ర్ యాడైంది. పోస్ట‌ర్లు ట్రైల‌ర్ ఆక‌ట్టుకున్నాయి. ఇక సెల్వ లాంటి సెన్సిటివ్ డైరెక్ట‌ర్ ఈ చిత్రాన్ని సూర్య అభిమానుల‌కు .. ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట‌య్యేలా తెర‌కెక్కించ‌డంలో స‌ఫ‌ల‌మ‌య్యారా.. లేదా? అన్న‌ది ఈ రివ్యూ చ‌దివి తెలుసుకోవాల్సిందే.

సింగిల్ లైన్:
ఒక సామాన్య రైతు రాజ‌కీయ నాయ‌కుడిగా ఎదిగేందుకు ప్ర‌య‌త్నించే క్ర‌మంలో ఎదురైన చిక్కులేంటి? దుష్ట రాజ‌కీయ నాయ‌కులు ఎలాంటి అడ్డంకులు సృష్టించారు? అన్న‌ది ఈ సినిమా బేసిక్ లైన్.

కథనం అనాలిసిస్:

సమాజం అంటే ఎంతో ప్రేమ సేవా భావాలు కలిగిన ఒక సామాన్య వ్యక్తి ఎన్‌జీకే (సూర్య‌). ఒక మామూలు రైతుగా గొప్ప స్థాయికి ఎద‌గాల‌ని క‌ల‌గ‌నే అత‌డి ఆలోచ‌న‌లు రాజ‌కీయ నాయ‌కుడు అవ్వాల‌ని ఎందుకు మారాయి? ఆ క్ర‌మంలోనే అత‌డి ఫ్యామిలీ… భార్య (సాయిప‌ల్ల‌వి) ప్రోద్భ‌లం ఎలాంటిది? అన్న‌ది ప్ర‌థ‌మార్థంలో క‌థాగ‌మ‌నంలో తెలుస్తుంది. అయితే ఫ‌స్టాఫ్ అంతా ప‌ర‌మ రొటీన్ గా సాగుతుంది. ఇప్పటికే ఎన్నో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలు చూడడం వలన ఈ సినిమాలో కనిపించే సన్నివేశాలు మరీ అంత కొత్తదనం కనిపించదు. సినిమా సగానికి చేరుకునే సరికి చిన్న ట్విస్ట్ ఆక‌ట్టుకుంటుంది. మిరాకిల్ అన‌ద‌గ్గ ఒక్క పాయింట్ కూడా లేకుండా ఫ‌స్టాఫ్ ముగుస్తుంది. ఇక ఈ క‌థ‌లో ర‌కుల్ పాత్ర ఒక కార్పొరెట్ పీఆర్. రాజ‌కీయాలు అంటే డ‌బ్బు మ‌యం. డ‌బ్బుతో ఏదైనా సాధ్య‌మే అని ప్ర‌పంచానికి ప్ర‌తీక‌గా క‌నిపిస్తుంది. ఇక రాజ‌కీయ నాయ‌కుడు కావాల‌నుకున్న సూర్య కు రాష్ట్ర ముఖ్య‌మంత్రి (దేవ‌రాజ్) ఆద‌ర్శ భావాలున్న సూర్య‌ని ఎలా ఉచ్చులో వేయాల‌నుకున్నాడు? ఆ ఉత్పాతం నుంచి బ‌య‌ట‌ప‌డి చివ‌రికి సూర్య అనుకున్న‌ది సాధించుకున్నాడా.. లేదా? అన్న‌దే సినిమా. ఈ క‌థ‌లో కార్పొరెట్ పీఆర్ ర‌కుల్ కి ఎన్‌జీకేతో క‌నెక్ష‌న్ ఏంటి? సాయిప‌ల్ల‌వి ఎలా మిస్ అండ‌ర్ స్టాండింగ్ చేసుకుంది? అన్న‌ది తెర‌పైనే చూడాలి.

ఒక పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ అంటే `రంగం` త‌ర‌హాలో ఎన్నో ఊహించ‌ని మ‌లుపులతో సాగాలి. కానీ ఎలాంటి ఆస‌క్తిక‌ర ఎలిమెంట్ లేకుండా ప‌ర‌మ రొటీన్ గా సాగ‌డం ఒక మైన‌స్ అనుకుంటే.. ఇందులో ఒక స‌న్నివేశానికి ఇంకో స‌న్నివేశానికి మ‌ధ్య సింక్ అన్న‌దే లేకుండా తెర‌కెక్కించ‌డం పెద్ద మైన‌స్. ఇక‌పోతే సెల్వ రాఘ‌వ‌న్ అంటే టాప్ క్లాస్ డైరెక్ట‌ర్. అత‌డు మ‌రోసారి త‌న స్థాయికి త‌గ్గ సినిమాని తీయ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌నే చెప్పాలి. సూర్య పాత్ర‌ను అత‌డు తీర్చిదిద్దిన తీరు.. అత‌డితో ఔట్ పుట్ రాబ‌ట్టుకున్న వైనం అద్భుతం. కాని సినిమా ఆద్యంతం యంగేజ్ చేయ‌డంలో దారుణంగా విఫ‌ల‌మ‌య్యాడు. ఇక ఈ చిత్రాన్ని ఒక చ‌క్క‌ని కామెడీతో.. వినోదంతో రంజింప‌జేసేలా తీర్చిదిద్ద‌డంలో సెల్వ ఫెయిల‌ర‌య్యారు.

నటీనటులు:
సూర్య మ‌రో మాస్ట‌ర్ పీస్ పెర్ఫామెన్సెస్ తో ఆక‌ట్టుకున్నాడు. అయితే క‌థా బ‌లం లేక‌పోవ‌డం అన్న‌ది అత‌డు ఏం చేసినా దానిని త‌గ్గించిన‌ట్ట‌య్యింది. ఇక కార్పొరెట్ పీఆర్ గా ర‌కుల్ గ్లామ‌ర్ బావున్నా.. న‌టించేందుకు స్కోప్ లేదు. భార్య పాత్ర‌లో సాయి ప‌ల్ల‌వి రోల్ అంతంత మాత్ర‌మే. ఆ రెండు పాత్ర‌లు
సిల్లీగా తేలిపోయాయి. ఇత‌ర పాత్ర‌లో సోసోనే.

టెక్నికాలిటీస్:
సాంకేతికంగా చెప్పుకునేందుకు విజువ‌ల్ రిచ్ నెస్ ఆక‌ట్టుకుంది. ముఖ్యంగా బీజీఎం ప్ర‌ధాన బ‌లం. రీరికార్డింగ్ యువ‌న్ శైలిలో ఆక‌ట్టుకుంటుంది. ఇక కెమెరా వ‌ర్క్ ఓకే. ఇందులో ఎడిటింగ్ కి పెద్ద స్కోప్ ఉన్నా .. ఆ విభాగం ప‌నితీరు అంతంత మాత్ర‌మే. తిర‌గ‌బ‌డు అనే పాట‌ను అద్భుతంగా తెర‌కెక్కించారు.

ప్లస్ పాయింట్స్:

* సూర్య న‌ట‌న‌
* యువ‌న్ బీజీఎం, రీరికార్డింగ్

మైనస్ పాయింట్స్:

* రొటీన్ క‌థ‌, గ్రిప్ లేని స్క్రీన్ ప్లే
* సెన్సిబిలిటీస్ మిస్ ఫైర్..
* కామెడీ.. ఎంట‌ర్ టైన్ మెంట్ లేక‌పోవ‌డం

ముగింపు:
రొటీన్ ఎన్‌జీకే .. నంద‌గోపాల్ పార్టీ గెలిచే సీనే లేదు!!

రేటింగ్:
2.0/5

Also Read : Ngk Live Review

User Comments