దీపావ‌ళి బ‌రి నుంచి ఔట్‌

Last Updated on by

సౌత్ స్టార్‌హీరో సూర్య‌కి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నేలేదు. గ‌జిని, సింగం సినిమాల‌తో అత‌డి ఖ్యాతి విశ్వ‌విఖ్యాతం అయ్యింది. సీరియ‌స్ కాప్ అంటే సూర్య అన్నంత‌గా పాపుల‌ర‌య్యాడు. ఆ క్ర‌మంలోనే ఎన్నో ఫ్లాపులు వ‌చ్చినా సూర్య కెరీర్ ప‌రంగా వెనుదిరిగి చూసిందే లేదు. ఇటీవ‌లే గ్యాంగ్ సినిమాతో జ‌నం ముందుకు వ‌చ్చినా, ఆశించిన ఫ‌లితం అందుకోలేక‌పోయాడు. అటుపై ఎన్‌జీకే అంటూ ప్ర‌యోగాత్మ‌క చిత్రంలో న‌టిస్తున్నాడు. ఇందులో విప్ల‌వ‌ యోధుడు చెగువేరాను త‌ల‌పించే గెట‌ప్‌తో క‌నిపించి ఆక‌ట్టుకున్నాడు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన సెకండ్ లుక్‌లో స్టూడెంట్ నాయ‌కుడిగా సూర్య కొత్త‌గా క‌నిపిస్తార‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

ఇప్ప‌టికే దీపావ‌ళి కానుక‌గా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నామని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. అయితే ఊహించ‌ని రీతిలో ఈ రిలీజ్ వాయిదా ప‌డింద‌ని క్రిటిక్ ర‌మేష్ బాలా ట్వీట్ చేశారు. ద‌ర్శ‌కుడు సెల్వ‌రాఘ‌వ‌న్ అనారోగ్యం వ‌ల్ల షూటింగుతో పాటు, ఎన్‌జీకే రిలీజ్‌ పోస్ట్‌పోన్ అయ్యింద‌ని ప్ర‌క‌టించారు. ఎన్‌జీకే షెడ్యూల్స్ మార్పు ఈ వాయిదాకి కార‌ణ‌మైంద‌ని ప్ర‌క‌టించారు. దీపావ‌ళి రేస్ నుంచి సూర్య త‌ప్పుకోవ‌డంతో.. మొత్తానికి ఓ క్రేజీ సినిమాని తొంద‌ర‌గా వీక్షించే భాగ్యం అభిమానులు కోల్పోయిన‌ట్ట‌యింది.

User Comments