నిఖిల్‌పై అంత బ‌డ్జెట్టా?

Nikhil - File Photo

నిఖిల్-చందు మొండేటి క్లాసిక్ హిట్ కార్తికేయ సీక్వెల్ తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకొని సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. తాజాగా ఈ చిత్రానికి నిఖిల్ కెరీర్ బెస్ట్ బ‌డ్జెట్ ని వెచ్చించార‌ని తెలిసింది. కోసం రూ.15 కోట్ల బడ్జెట్ ను కేటాయించారట. ఈ సినిమాను ఎక్కువగా విదేశాల్లో చిత్రీకరించాల్సి ఉంది. అలాగే విఎఫ్ఎక్స్ ప‌ని ఎక్కువగా ఉండటంతో.. ఇంత ఖ‌ర్చు చేస్తున్నార‌ట‌.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్, ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల గురించి తెలియాల్సి ఉంది. అయితే నిఖిల్ రేంజుకు మించి బ‌డ్జెట్ పెడుతున్నారు అంటే ఎంచుకున్న క‌థ‌లో అంత ద‌మ్ముంద‌నే భావించాలి. మ‌రి చందు మ‌రోసారి ఈ సినిమాతో కంబ్యాక్ అవుతాడా?  నిఖిల్ కి కంబ్యాక్ మూవీ అవుతుందా? అన్న‌ది చూడాలి.