Last Updated on by
బాలీవుడ్లో పెళ్లిళ్లతో సందడి వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. దీపిక -రణవీర్ జోడీ పెళ్లితో పాటు ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ పెళ్లి వేడి పెంచింది. ఈనెల 1,2 తేదీల్లో హిందూ సాంప్రదాయంలో ఓసారి, క్రిస్టియన్ సాంప్రదాయంలో ఇంకోసారి పెళ్లాడుకున్నారు ఈ జంట. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం అంతర్జాలంలో వేగంగా పాపులరవుతున్నాయి.
నిక్+ప్రియాంక= నిక్యాంక అంటూ సమీకరణం పాపులరైంది. నిక్యాంక జోడీ ఫోటోల్ని యూత్ సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ చేస్తున్నారు. ఇదివరకూ రెండు ట్రెడిషన్స్కి సంబంధించిన ఫోటోలు కొన్ని అంతర్జాలంలోకి వచ్చాయి. తాజాగా ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన రకరకాల అకేషన్స్ ఫోటోలు రిలీజయ్యాయి. వీటిలో ప్రియాంక చోప్రా ఎర్రని డ్రెస్‌లో ముద్దమందారాన్ని తలపించింది. ఆ పక్కనే వరుడు నిక్ ఎంతో ట్రెడిషనల్‌గా కనిపించాడు. హిందూ సాంప్రదాయానికి చెందిన ఫోటోలు, అలానే క్రిస్టియన్ స్టైల్ వెడ్డింగ్‌కి సంబంధించిన ఫోటోలు విరివిగా వెబ్‌లోకి వచ్చాయి. ప్రఖ్యాత `హలో` మ్యగాజైన్ అందించిన నిక్యాంక లీక్స్ స్పెషల్ ఫోటోస్ ఇవిగో..
User Comments