స‌వ్య‌సాచి హీరోయిన్ అందాల నిధి

Last Updated on by

ఈ ఫోటో చూస్తుంటే ఇదే అనాలనిపిస్తుంది క‌దా మ‌రి..! నిధి అగ‌ర్వాల్.. ఈ భామ పేరు టాలీవుడ్ లో పెద్ద‌గా తెలియ‌క‌పోవ‌చ్చు కానీ స‌రిగ్గా ఆర్నెళ్ల త‌ర్వాత ఖచ్చితంగా తెలుగు ఇండ‌స్ట్రీలో నిధి పేరు మారుమోగ‌డం ఖాయం. ఎందుకంటే ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య‌తో స‌వ్య‌సాచి సినిమాలో న‌టిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇది వ‌ర‌కే బాలీవుడ్ లో మున్నామైఖెల్ లో టైగ‌ర్ ష్రాఫ్ తో జోడీక‌ట్టింది ఈ ముద్దుగుమ్మ‌. ఇక ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌స్తుంది. వ‌స్తూ వ‌స్తూనే త‌న టాలెంట్ అంతా చూపిస్తుంది. అందాల నిధి తాళం ఓపెన్ చేసి ప్రేక్ష‌కుల‌కు క‌నువిందు చేస్తుంది.

సినిమాల్లోనూ దీనికి ఏ మాత్రం త‌గ్గ‌కుండానే ఎక్స్ పోజింగ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఈమె దూకుడు చూసి ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా ప‌రేషాన్ అవుతున్నారు. ఎంతైనా బాలీవుడ్ బ్యూటీ క‌దా.. అక్క‌డ్నుంచి వ‌చ్చిన బుద్దులు ఎక్క‌డికి పోతాయి..? స‌వ్య‌సాచి విడుద‌ల‌కు ముందే తెలుగులో బిజీ అవ్వాల‌ని చూస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. దానికోసం తెలిసిన దారుల‌న్నింటినీ వాడేస్తుంది నిధి అగ‌ర్వాల్. దానికితోడు అందాల నిధి కూడా వెంట‌నే తోడుగా ఉంది. దాంతో ఈ భామ మాయ చేయ‌డానికి చూస్తుంది. మ‌రి.. నిధి అగ‌ర్వాల్ అందాల నిధి తెలుగులో ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో..!

User Comments