28న మెగా గాళ్ పెళ్లి

Last Updated on by

స్టార్ హీరోల కుమార్తెలు క‌థానాయిక‌లు అవ్వ‌డం అన్న‌ది రేర్ సిట్యుయేష‌న్‌. ఇది బాలీవుడ్‌లో ఓకే కానీ, టాలీవుడ్‌లో నాట్ ఓకే. కానీ ప్ర‌స్తుత స‌న్నివేశంలో పూర్తి మార్పు క‌నిపిస్తోంది. తొలిగా మెగా కాంపౌండ్ లో ఈ విప్ల‌వం మొద‌లైంది. మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న కుమార్తె నీహారిక‌ను ఆశీర్వ‌దించి ఈ రంగంలో ప్రోత్స‌హిస్తున్నారు. నీహారిక పెద్ద స్టార్ కావాల‌ని పెద‌నాన్న మెగాస్టార్ చిరంజీవి ఇదివ‌ర‌కూ ఆశీర్వ‌దించారు. మెగా కాంపౌండ్ హీరోల నుంచి నీహారిక‌కు కావాల్సిన పూర్తి స‌పోర్ట్ ఉంది. ఆ క్ర‌మంలోనే వెబ్ సిరీస్‌లు, సినిమాలు అంటూ నీహా ఇప్ప‌టికే చాలా అనుభ‌వ‌మే ఘ‌డించింది.

నీహారిక న‌టించిన రెండో సినిమా `హ్యాపీ వెడ్డింగ్` ఈనెల 28న‌ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సినిమాని యు.వి.క్రియేష‌న్స్& పాకెట్ సినిమా ప‌తాకంపై ల‌క్ష్మ‌ణ్ కార్య ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించారు. ఇదే చిత్రంలో సుమంత్ అశ్విన్ క‌థానాయ‌కుడిగా న‌టించారు. నీహారిక‌తో పాటు సుమంత్ అశ్విన్‌కి ఈ సినిమా బ్రేక్‌నివ్వాల్సిన స‌న్నివేశం ఉంది.

User Comments