Niharika Konedela Wedding Bells Started Special on Feb 14th

నిహారిక పెళ్లి కార్డ్ వ‌చ్చేసింది

Niharika Konedela Wedding Bells Started

చాలా సైలెంట్ గా నిహారిక పెళ్లి ప‌నులు జ‌రిగిపోతున్నాయి. తాజాగా ఆమె పెళ్లి కార్డ్ కూడా వ‌చ్చేసింది. వాలెంటైన్ డే కానుక‌గా ఫిబ్ర‌వ‌రి 14 ఉద‌యం 8 గంట‌ల‌కు ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కానుంది. కాక‌పోతే ఈ పెళ్లి క‌బుర్లు అన్నీ సినిమా కోస‌మే. నిజంగా కాదు.. ప్ర‌స్తుతం హ్యాపీ వెడ్డింగ్ సినిమాలో న‌టిస్తుంది నిహారిక‌. సుమంత్ అశ్విన్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేష‌న్స్ నిర్మిస్తుండ‌టం విశేషం. ఇప్పుడు ఈమె కెరీర్ కు హ్యాపీ వెడ్డింగ్ కీల‌కం. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. ఈ చిత్రానికి శక్తి కాంత్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ సైలెంట్ గా పూర్త‌యింది. స‌మ్మ‌ర్ లో సినిమా విడుద‌ల కానుంది.

Niharika Konidela 002 నిహారిక పెళ్లి కార్డ్ వ‌చ్చేసింది

యువీ క్రియేష‌న్స్ బ్యానర్ బ్రాండ్ నుంచి తెలుగులో త‌న‌కు తొలి విజ‌యం వస్తుందని న‌మ్ముతుంది నిహారిక‌. ఈ మ‌ధ్యే త‌మిళ ఇండ‌స్ట్రీకి కూడా వెళ్లింది ఈ ముద్దుగుమ్మ‌. అక్క‌డ ఈమె న‌టించిన తొలి సినిమా విజ‌య్ సేతుప‌తితో ఒరు న‌ల్ల‌నాల్ పాతు సొల్రెన్ అనే సినిమాలో న‌టించింది. కానీ ఇది ఫ్లాప్. దాంతో కెరీర్ లో తొలి విజ‌యం కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా చూస్తుంది నిహారిక‌. పెళ్లి ముచ్చ‌ట్లు అయినా నిహా తొలి హిట్ క‌ల‌ను నెర‌వేరుస్తుందో లేదో..?

నిహారిక పెళ్లి కార్డ్ వ‌చ్చేసింది
0 votes, 0.00 avg. rating (0% score)