నిహారిక హ్యాపీ వెడ్డింగ్.. త్వరలోనే

Last Updated on by

అస‌లే ఇప్పుడు ఇండ‌స్ట్రీలో నిహారిక పెళ్ళిపై కావాల్సినంత ర‌చ్చ న‌డుస్తుంది. నాగ‌శౌర్య‌తో ఈమె పెళ్లి జ‌ర‌గ‌బోతుందంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ విష‌యంపై హీరో సైలెంట్ గానే ఉన్నా కూడా ఇప్ప‌టికీ రూమ‌ర్స్ అయితే ఆగడం లేదు. ఇలాంటి టైమ్ లో నిహారిక పెళ్లి ముచ్చ‌ట్లు ఫిబ్ర‌వ‌రి 14న ప్రేమికుల రోజు బ‌య‌టికి రానున్నాయి. అవును.. ఈ విష‌యంపై స్వ‌యంగా నిహారికే క‌న్ఫ‌ర్మ్ చేసింది. అయితే ఇక్క‌డే చిన్న ట్విస్ట్ ఉంది. ఆమె క‌న్ఫ‌ర్మ్ చేసింది సినిమా గురించే.. రియ‌ల్ లైఫ్ గురించి కాదు. మూడేళ్ల‌ కింద ఒక మ‌న‌సుతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది ఈ భామ‌. కానీ అది డిజాస్ట‌ర్ గా నిల‌వ‌డంతో న‌టిగా తాను ఎంతో ఎత్తుకు ఎదుగుతాన‌ని ఆశించిన నిహా ఆశ‌ల‌న్నీ అడియాశ‌ల‌య్యాయి. దాంతో ఒక మ‌న‌సు త‌ర్వాత నిహారిక పూర్తిగా క‌నిపించ‌డం మానేసింది. త‌మిళ ఇండ‌స్ట్రీకి వెళ్లిపోయి అక్క‌డ విజ‌య్ సేతుప‌తితో ఒరు న‌ల్ల‌నాల్ పాతు సొల్రెన్ అనే సినిమా చేసింది. ఈ సినిమా ఓకే అనిపించుకొంది.

ఒక మ‌న‌సు ఫ్లాప్ త‌ర్వాత తెలుగులో అస‌లు సినిమాలు చేస్తుందా.. చేయ‌దా..? అనే ప్ర‌శ్న‌కు తెర‌దించుతూ కొత్త ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్ కార్య తో హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమా చేస్తుంది నిహారిక‌. ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్ హీరోగా న‌టిస్తున్నాడు. యువీ క్రియేష‌న్స్ నిర్మిస్తున్న‌ ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ పూర్త‌యింది. సైలెంట్ గా ప‌ని పూర్తి చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. స‌మ్మ‌ర్ లో సినిమా విడుద‌ల కానుంది. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ ఫిబ్ర‌వరి 14న ప్రేమికుల రోజు కానుక‌గా విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. హ్యాపీవెడ్దింగ్ పై చాలా ఆశ‌లే పెట్టుకుంది నిహారిక‌. దేవీ సంగీతం.. యువీ క్రియేష‌న్స్ బ్యానర్ బ్రాండ్ అంతా క‌లిసి తెలుగులో త‌న‌కు తొలి విజ‌యం తీసుకొస్తాయ‌ని న‌మ్ముతుంది నిహారిక‌.

User Comments