నీహారిక‌ పెళ్లి కుదిరింది

Last Updated on by

అవునా.. మెగా డాట‌ర్ పెళ్లి కుదిరిందా? అంటే కుదిరింద‌నే తెలుస్తోంది. ఇంత‌కీ ఎక్క‌డ అంటే ఆన్ ద స్క్రీన్‌. పెళ్లి కుదిరాక మ‌గువ మ‌న‌సులో అల‌జ‌డి ఎలా ఉంటుంది? పెళ్లి జ‌రిగేవ‌ర‌కూ త‌తంగం ఎలా ఉంటుంది. అమ్మాయి మ‌న‌సు ఎంత‌గా ప‌రిత‌పిస్తుంది? అన్న‌ది తెర‌పై చూడాల‌నుకుంటే నీహారిక సినిమా చూడాల్సిందేనంటున్నారు.

నీహారిక కొణిదెల న‌టిస్తున్న తాజా సినిమా హ్యాపి వెడ్డింగ్‌. సుమంత్ అశ్విన్ క‌థానాయ‌కుడు. చ‌క్క‌టి కుటుంబ అనుబంధాలు ఉన్న చిత్ర‌మిది. సున్నిత ఉద్వేగాలు ఆక‌ట్టుకుంటాయి. ల‌క్ష్మ‌ణ్ ద‌ర్శ‌క‌త్వ ం వ‌హించారు. నాయ‌కానాయిక‌లు ట్రైల‌ర్‌ని ఆవిష్క‌రించారు. నీహారిక మాట్లాడుతూ “అగ్ర‌నిర్మాణ సంస్థ‌లో సినిమా చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. ల‌క్ష్మ‌ణ్ చాలా బాగా తెర‌కెక్కించారు. ప్ర‌తి పాత్రా మెప్పిస్తుంది. సినిమా మొత్తం ప్లెజెంట్‌గా ఉంటుంది. అన్ని వ‌ర్గాల‌కు న‌చ్చుతుంది“ అని అన్నారు. నీహారిక‌తో న‌టించ‌డం చ‌క్క‌ని అనుభ‌వం. సినిమా విజ‌యం సాధిస్తుంది అన్నాడు. ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ “పెళ్లి అనేది ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో కీల‌కం. పెళ్ళి కుదిరిన రోజు నుండి పెళ్ళి జ‌రిగేరోజు వ‌ర‌కు రెండు మ‌న‌సుల మ‌ధ్య ఏం జ‌రుగుతుంది? అనేది చాలా అందంగా చూపించాం. ప్ర‌తి ఒక్క‌రి జీవితం లో ఇలాంటి అనుభ‌వం ఉంటుంది.. అని అన్నారు.

User Comments