మెగా ప్రిన్సెస్‌కి బ‌య్య‌ర్లు లేరా?

Last Updated on by

న‌ట వార‌స‌త్వాన్ని ముందుకు తీసుకెళ్ల‌డం అంద‌రికీ వీజీనా? పైగా జిగ్ జాగ్ గ్లామ‌ర్ ప‌రిశ్ర‌మ‌లో గ్లామ‌ర్ జిగిబిగిని ఎలివేట్ చేయ‌క‌పోతే క్రేజు తెచ్చుకోవ‌డం అంత సులువేం కాదు. సాంప్ర‌దాయ బ‌ద్ధ‌మైన విధానంలో వెళితే క‌చ్ఛితంగా ఇంకేదైనా మ్యాజిక్ జ‌ర‌గాలి. ఈ రెండు కోణాల్లోనూ మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల ఎందుకో త‌డ‌బ‌డ‌డం ప‌లుమార్లు చ‌ర్చ‌కొచ్చింది. డీసెంట్ ఫ్యామిలీ గాళ్ గా మెగా డాట‌ర్ నిహారిక హ‌ద్దు దాట‌కుండా సెల‌క్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. తొలి నుంచి ఇదే పంథాని ఎంచుకున్నారు. అయితే బుల్లితెర‌కు కుదిరినంత‌గా, పెద్ద తెర‌కు ఈ ఫార్మాట్ వ‌ర్క‌వుట‌వ్వ‌డం లేద‌న్న‌ది ఓ విశ్లేష‌ణ‌.

ప్ర‌స్తుతం నిహారిక న‌టిస్తున్న `సూర్య‌కాంతం` స‌న్నివేశ‌మ‌దే. ఈ సినిమా టీజ‌ర్ ఆక‌ట్టుకుంది. పోస్ట‌ర్లు బావున్నాయ‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. కానీ ఎందుక‌నో బిజినెస్ ప‌రంగా స్పీడ్ లేద‌ట‌. బ‌య్య‌ర్లు లేక సొంతంగా రిలీజ్ చేసుకునే స‌న్నివేశం నెల‌కొంద‌ని తెలుస్తోంది. ప్ర‌ఖ్యాత అమెరికా డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ.. నిర్వాణ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వెబ్ సిరీస్, ల‌ఘు చిత్రాల ద‌ర్శ‌కుడు ప్ర‌ణీత్ భ్ర‌మండ‌ప‌ల్లి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. టీజ‌ర్ ఆక‌ట్టుకోవ‌డంతో సినిమాకి బ‌జ్ పెరుగుతుంద‌ని భావించినా అలా జ‌ర‌గ‌లేదు. దాంతో ఇప్పుడు రిలీజ్ విష‌య‌మై డైలెమా నెల‌కొంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ మార్చి 29న రిలీజ్ చేస్తే బావుంటుంద‌ని భావించినా .. ప్రీబిజినెస్ పూర్త‌వ్వ‌క‌పోవ‌డంతో ఈ స‌న్నివేశం నెల‌కొంద‌ట‌. ఇక ఈ చిత్రంలో ఫైట్ మాష్ట‌ర్ విజ‌య్ కుమారుడు హీరోగా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

User Comments