మెగా డాట‌ర్ కి పెళ్లి గ‌డియ‌లు వ‌చ్చేసిన‌ట్లే

మెగా డాట‌ర్ నాగ‌బాబు త‌న‌య నిహారిక బుల్లి తెర నుంచి వెండి తెర‌కు ప్ర‌మోట్ అయింది. సినిమా కెరీర్ ప్రారంభించి మూడేళ్లు గ‌డుస్తున్నా ఇంకా ఆమెకు న‌టిగా స‌రైన గుర్తింపు రాలేదు. ఒక మ‌నుసు, హ్యాపీ వెడ్డింగ్ సినిమాల్లో న‌టించింది. అటు త‌మిళ్ సినిమాల్లోనూ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది. కానీ రెండు చోట్ల క‌లిసిరాలేదు. వెబ్ సిరీస్ లు చేస్తోంది. ప్ర‌స్తుతం `సూర్య‌కాంతం` లో అల్ల‌రిపిల్ల‌గా న‌టిస్తోంది. ఇటీవ‌ల విడుద‌లైన ఆ సినిమా ట్రైల‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. త్వ‌రలోనే ఆసినిమా విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో నాగ‌బాబు కూతురు విష‌యంలో సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించారు.

`2019 లో ఆమె పెళ్లి ఖాయం. ఈ విష‌యం నిహారిక‌కు ముందుగానే చెప్పా. సినిమాల్లోకి వెళ్తానంటూ వ‌ద్ద‌న‌లేదు. అప్పుడే ఈ కండీష‌న్ పెట్టా. అందుకు త‌ను ఒప్పుకుంది. ఇప్పుడా స‌మ‌యం ఆస‌న్న‌మైంది. మంచి కూర్రాడి కోసం వెతుకుత‌న్నాం. సినీ రంగం నుంచే కావాల‌నే ఆంక్షలేవి లేవు. మంచి గుణం, వ్య‌కిత్వం గ‌ల అబ్బాయి కావాలి. కుటుంబ నేప‌థ్యం బాగుండాలి. నాకు కులం, మంతం, ప్రాంతం బేధాలేవి లేవు. స‌రైన సంబంధం దొరికితే పెళ్లి చేసి అత్తారికింటికి పంపిచాల‌నుకుంటున్న‌ట్లు` తెలిపారు. మ‌రి నిహారిక వెర్ష‌న్ ఎలా ఉంటుందో చూద్దాం.