శేఖ‌ర్ క‌మ్ములాని వ‌ద‌ల‌నంటోన్న నిఖిల్

శేఖ‌ర్ క‌మ్ముల‌ తెర‌కెక్కించిన `హ్యాపీడేస్` చిత్రం ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. ఒక్క హిట్ తో నిఖిల్, వ‌రుణ్ సందేశ్ ల జీవితాలే మారిపోయాయి. ఇద్ద‌రు పెద్ద స్టార్లు అయ్యారు. ప్ర‌స్తుతం వరుణ్ సందేశ్ సినిమా కెరీర్ ముగిసినా! నిఖిల్ మాత్రం తెలివిగా వైవిథ్య‌మైన సినిమాలు చేసుకుంటూ త‌న కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకున్నాడు. అయితే ఇప్పుడీ హీరో కెరీర్ కూడా ఇటీవల కాలంలో ఆశించినంత‌గా  సాగ‌లేదు. ప‌ర‌జయాలు వెంటాడుతున్నాయి. ఈ నేప‌థ్యంలో నికిల్ మ‌న‌సు హ్యాపీడేస్ సీక్వెల్ ను కోరుకుంటున్న‌ట్లు మ‌రోసారి బ‌య‌ట పెట్టాడు. హ్యాపీడేస్ లో ఓ  ఎమోష‌న‌ల్ స‌న్నివేశాన్ని షేర్  చేస్తూ…. ఎంత మంది హ్యాపీడేస్ సీక్వెల్ కోరుకుంటున్నారో. వాళ్లంతా ఈసీన్ నా ఇష్ట‌మైన ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌ కు చేరేలా షేర్ చేయండంటూ ట్విట‌ర్ ద్వారా పిలుపునిచ్చాడు.

`హ్యాపీడేస్` సీక్వెల్ వ‌స్తే  చూడాల‌ని కోరుకుంటున్న వ‌ర్గం గ‌ట్టిగానే ఉంది. సీక్వెల్ వ‌స్తున్నట్లు రూమ‌ర్లు కూడా వినిపించాయి. కానీ వీటిపై ఏ రోజు శేఖ‌ర్ క‌మ్ముల‌ స్పందించ‌లేదు. మ‌రి ఈసారైనా నికిల్ కోరిక మేర‌కు రియాక్ష‌న్ ఏమైనా ఉంటుందేమో చూడాలి. `ఫిదా` తో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన త‌ర్వాత శేఖ‌ర్ క‌మ్ముల‌ ఆ మ‌ధ్య కొత్త న‌టీనుటుల‌తో  కొత్త ప్రాజెక్ట్ ను సెట్స్ కు తీసుకెళ్లారు. ఆన్  సెట్స్ కు వెళ్లి కొన్ని నెల‌లు గ‌డుస్తోంది. కానీ షూటింగ్ ఎంత వ‌ర‌కూ పూర్త‌యింద‌న్న అప్ డేట్ ఇప్ప‌టివ‌ర‌కూ తెలియ‌లేదు. ఆ సినిమా నిర్మాత‌ల‌తో  వివాదాలు త‌లెత్తిన‌ట్లు  వార్త‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సినిమా ఆగిపోయిన‌ట్లు  ప్ర‌చారంలోకి వ‌చ్చింది.