ముద్ర లుక్ అదిరిపోయిందిగా..!

Last Updated on by

నిఖిల్ ఇప్పుడు ముద్ర వేస్తున్నాడు. ఈయ‌న కొత్త సినిమాకు ఇదే టైటిల్ క‌న్ఫ‌ర్మ్ చేసారు కూడా. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు ఈయ‌న ఆశ‌ల‌న్నీ ఇదే సినిమాపై ఉన్నాయి. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ఎన్నో శ‌లు పెట్టుకున్న కిరాక్ పార్టీ ఫ్లాప్ కావ‌డం.. దానికి ముందు కేశ‌వ కూడా యావ‌రేజ్ గానే ఆడ‌టంతో ఇప్పుడు ముద్ర హిట్ నిఖిల్ కు కీల‌కంగా మారింది. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా త‌ర్వాత ఆ రేంజ్ హిట్ నిఖిల్ కు లేదు. ప్ర‌స్తుతం ఈయ‌న క‌ణిత‌న్ రీమేక్ లో న‌టిస్తున్నాడు. ఒరిజిన‌ల్ ను తెర‌కెక్కించిన టిఎన్ సంతోష్ తెలుగులోనూ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలోని పూర్తి క‌థ‌ను కాకుండా.. కేవ‌లం లైన్ మాత్ర‌మే తీసుకుని ఇక్క‌డి ప్రేక్ష‌కుల అభిరుచికి త‌గ్గ‌ట్లుగా క‌థ‌ను మార్చామ‌ని చెబుతున్నాడు నిఖిల్. ఇది ఫేక్ స‌ర్టిఫికేట్ల నేప‌థ్యంలో తెర‌కెక్కిన సినిమా. అథ‌ర్వ న‌టించిన ఈ చిత్రం త‌మిళ‌నాట మంచి విజ‌యం సాధించింది.

ముందు ఈ చిత్రాన్ని ర‌వితేజ‌తో రీమేక్ చేయాల‌ని భావించాడు ద‌ర్శ‌కుడు సంతోష్. ర‌వితేజ ఫైన‌ల్ అయిన త‌ర్వాత ఎందుకో ఆగిపోయింది ఈ చిత్రం. ఇప్పుడు నిఖిల్ వ‌చ్చాడు ఈ ప్రాజెక్ట్ లోకి. ఈ చిత్ర షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. తాజాగా విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ చూస్తుంటే నిఖిల్ చాలా కొత్త‌గా క‌నిపిస్తున్నాడు. మీసాలు, గ‌డ్డంతో కేశ‌వ లుక్ కంటిన్యూ చేస్తున్నాడు నిఖిల్. ఈ చిత్రాన్ని ఠాగూర్ మ‌ధు నిర్మిస్తున్నాడు. లావ‌ణ్య త్రిపాఠి ఇందులో హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈ సినిమా షూటింగ్ స‌గం పూర్తైందో లేదో శాటిలైట్ రైట్స్ ను ఓ లీడింగ్ ఛానెల్ 5.50 కోట్ల‌కు ద‌క్కించుకుంది. నిఖిల్ కెరీర్ లో ఇదే హైయ్య‌స్ట్ రేట్. ఆయ‌న సినిమాలు వ‌సూలు చేసే మొత్తంలో దాదాపు స‌గానికి పైగా ఉంటుంది ఇది. బ‌డ్జెట్ కూడా 10 కోట్లలోపే ఉంది. ఆ బ‌డ్జెట్ కూడా ఇప్పుడే వ‌చ్చేసింది. ఫేక్ స‌ర్టిఫికేట్ ల నేప‌థ్యం కాబ‌ట్టి ముద్ర అనేది ప‌ర్ ఫెక్ట్ టైటిల్. మ‌రి.. ఈ ముద్ర నిఖిల్ కెరీర్ పై ఎలాంటి ముద్ర వేయ‌బోతుందో..? ఇదే ఏడాది సినిమా విడుద‌ల కానుంది.

User Comments