నెక్స్ట్ సినిమా కోసం గట్టిగానే కష్టపడుతున్నాడు

Last Updated on by

నిఖిల్ ప్ర‌స్తుతం సూప‌ర్ ఫామ్ లో ఉన్నాడు. ఈయ‌న సినిమాల‌న్నీ వ‌ర‌స‌గా విజ‌యాలు అందుకుంటున్నాయి. గ‌త సినిమా కేశ‌వ కూడా ఓకే అనిపించింది. దాంతో ఇప్పుడు నిఖిల్ నుంచి సినిమా వ‌స్తుందంటే అంచ‌నాలు భారీగానే ఉంటున్నాయి. ప్ర‌స్తుతం ఈయ‌న కిరాక్ పార్టీ సినిమా రీమేక్ లో న‌టిస్తున్నాడు. క‌న్న‌డ‌లో హిట్టైన ఈ సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేసారు. శ‌ర‌ణ్ కొప్పిశెట్టి ద‌ర్శ‌కుడు. దీనికి చందూమొండేటి, సుధీర్ వ‌ర్మ కూడా ప‌ని చేయ‌డం విశేషం. చందూ డైలాగులు రాస్తే.. సుధీర్ స్క్రీన్ ప్లే ఇచ్చాడు. ఇదంతా త‌మ స్నేహితుడు నిఖిల్ కోస‌మే. ఈ సినిమాను ముందు ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల చేయాల‌నుకున్నారు.

అయితే ఆ రోజు మ‌రో మూడు సినిమాలు ఉండ‌టం.. పైగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ కూడా బ్యాలెన్స్ ఉండ‌టంతో మార్చ్ 22కి పోస్ట్ పోన్ చేసారు సినిమాను. మార్చ్ లో భారీ సినిమాలు వ‌స్తున్నాయ‌ని తెలిసి కూడా త‌న సినిమాను రేస్ లోకి దింపుతున్నాడు నిఖిల్. మార్చ్ 29న మ‌హాన‌టి.. 30న రంగ‌స్థ‌లం రానున్నాయి. అందుకే వాటికంటే వారం ముందే త‌న సినిమాను విడుద‌ల చేస్తున్నాడు ఈ కుర్ర హీరో. ఖచ్చితంగా ఈ సినిమా త‌న కెరీర్ కు బాగా హెల్ప్ అవుతుంద‌ని భావిస్తున్నాడు నిఖిల్. ఇదిలా ఉంటె తన నెక్స్ట్ సినిమా కోసం జిమ్ లో వర్క్ ఔట్స్ మొదలు పెట్టాడు. తన లుక్ మార్చుకొనే పనిలో బిజీగా ఉన్నాడు నిఖిల్. మరి ఈ వర్క్ ఔట్స్ చేసిన బాడీని నెక్స్ట్ సినిమాలో చూపిస్తాడో..?

https://twitter.com/actor_Nikhil/status/965566615680176128

User Comments