ఆయిల్ లుక్‌.. నికీషా షాక్

Last Updated on by

`కొమ‌రం పులి` చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది దిల్లీ బ్యూటీ నికీషా ప‌టేల్. ఆరంభ‌మే ప‌వ‌న్ స‌ర‌స‌న ఛాన్స్ త‌న‌కు అదృష్ట‌మే అనుకుంటే, ఫ్లాప్ రూపంలో దుర‌దృష్టం వెంటాడింది. ఆ త‌ర్వాత చిన్నా చిత‌కా సినిమాల‌తోనే ఈ దిల్లీ బ్యూటీ స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. ప‌వ‌న్ హీరోయిన్ గా ఉన్న పాపులారిటీతో తెలుగులో ఆ మాత్రం అవ‌కాశాలు అందుకుంది. ప్ర‌స్తుతం త‌మిళంలో కెరీర్ ప‌రంగా బిజీగానే ఉన్నా, ఆశించినంత స్టార్ డ‌మ్ మాత్రం చిక్క‌లేదు.

అయితేనేం.. ఇదిగో ఇలా ఫోటోషూట్ల‌తో అంత‌ర్జాలంలో వేడెక్కిస్తోంది. నిరంత‌రం లేటెస్ట్ ఫోటోషూట్ల‌ను ఇన్ స్టాగ్ర‌మ్ లో అభిమానుల‌కు షేర్ చేస్తోంది. ఈసారి కాస్తంత ఎక్స్‌పెరిమెంట్ చేసిన‌ట్టే క‌నిపిస్తోంది. పూర్తిగా టోన్డ్ ఆయిల్ బాడీని అభిమానుల కోసం రెడీ చేసి ఇదిగో ఇలా షేర్ చేసింది. కొమ‌రం పులిలో పులి పిల్ల ఇలా ఉన్న‌ట్టుండి ఇంత హాట్ గా మారిపోయిందే అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.అశోక్ కోటియ‌న్ ఫోటోగ్ర‌ఫీలో మోష‌న్ లుక్ అద‌ర‌హో అనే చెప్పాలి. రెడ్ హాట్ బికినీ లుక్ లో తీక్ష‌ణంగా చూస్తున్న నికీషా .. పై నుంచి మ‌బ్బులు ర‌య్ మ‌ని దూసుకెళ్తున్నాయ్. ఆ రింగుల జుత్తు నెమ్మ‌దిగా క‌దులుతూ మ‌త్తు చ‌ల్లుతోంది. కాన్సెప్ట్ అద్భుతం అంటూ పొగిడేయాల్సిందే.

User Comments