నితిన్ కెరీర్ కు పెళ్లి అవసరం

Last Updated on by

పెళ్లి మ‌న‌షుల‌తో ఆడుకుంటుంది కానీ.. ఇక్క‌డ మాత్రం మ‌నిషే పెళ్లితో ఆడుకుంటున్నాడు. అది కూడా మ‌న హీరో నితిన్. ఏమైందో తెలియ‌దు కానీ స‌డ‌న్ గా ఇప్పుడు ఈయ‌న పెళ్లిపై ప‌డ్డాడు. ఒకేసారి రెండు సినిమాలు పెళ్లి కాన్సెప్ట్ తోనే చేస్తున్నాడు. అందులో ఒక‌టి పెళ్లంటే నూరేళ్ల పంట అంటుంటే.. మ‌రోటి మాత్రం పెళ్ళంటే నూరేళ్ల మంట అంటున్నాడు. పూర్తి భిన్నంగా ఒక‌టి చేస్కో అని.. మ‌రోటి వ‌ద్దు అంటున్నాడు. ప్ర‌స్తుతం శ్రీ‌నివాస క‌ళ్యాణంలో పెళ్లి గొప్ప‌త‌నం చెబుతున్నాడు నితిన్. స‌తీష్ వేగేశ్న తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఆగ‌స్ట్ 9న విడుద‌ల కానుంది ఈ చిత్రం.

ఇదిలా ఉంటే ఈ చిత్రం త‌ర్వాత ఛ‌లో ఫేమ్ వెంకీ కుడుముల‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు నితిన్. దీనికి భీష్మ‌.. సింగిల్ ఫ‌రెవ‌ర్ అనే ట్యాగ్ లైన్ పెట్టార‌ని తెలుస్తుంది. ఈ చిత్రంలో పెళ్లంటే నో అనే యువ‌కుడిగా న‌టించ‌బోతున్నాడు నితిన్. పెళ్లిపై వెంకీ ఫుల్ సెటైరిక‌ల్ గా ఈ చిత్రం చేస్తున్నాడ‌ని తెలుస్తుంది. ఈ చిత్రంలో మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా న‌టించ‌బోతుంది. త్వ‌ర‌లోనే షూటింగ్ మొద‌లు కానుంది. సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొత్తానికి ఓ సినిమాలో పెళ్లికి జై అంటూ.. మ‌రో సినిమాలో మాత్రం పెళ్లికి నై అంటున్నాడు నితిన్. ఏదేమైనా ఫ్లాపుల్లో ఉన్న నితిన్ కెరీర్ కు ఈ రెండు సినిమాలు కీల‌క‌మే.

User Comments