`ప‌వ‌ర్ పేట‌`లో నితిన్ గెట‌ప్పులు

నితిన్ క‌థానాయ‌కుడిగా కృష్ణ‌చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో `ప‌వ‌ర్ పేట‌` తెర‌కెక్క‌బోతోంది. ఇదివ‌ర‌కు వీళ్లిద్ద‌రూ క‌లిసి చేసిన `ఛ‌ల్ మోహ‌న్ రంగ‌` పరాజ‌యాన్ని చ‌విచూసింది. అయినా కృష్ణ‌చైత‌న్య సిద్ధం చేసిన క‌థ‌పై న‌మ్మ‌కంతో `ప‌వ‌ర్ పేట‌`కి ఓకే చెప్పేశారు. నితిన్‌, కృష్ణ‌చైత‌న్య మంచి స్నేహితులు. గేయ ర‌చ‌యిత‌గా ప‌రిచ‌య‌మైన చైత‌న్య మంచి క‌థ‌కుడు అని త‌న తొలి సినిమా `రౌడీ ఫెలో`తోనే నిరూపించుకున్నాడు. `ఛ‌ల్ మోహన్ రంగ‌` కూడా విజ‌య‌వంత‌మ‌య్యుంటే ఆయ‌న కెరీర్ మ‌రోస్థాయికి వెళ్లేదే. కానీ త్రివిక్ర‌మ్ రాసిన ఆ క‌థ‌పై ఆయ‌న‌కి ప‌ట్టు దొర‌క‌లేదు. దాంతో సినిమా ఫెయిల్యూర్ అయ్యింది. ఇక `ప‌వ‌ర్ పేట‌`తోనే ఆయ‌న నిరూపించుకోవ‌ల్సి ఉంది. త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్ల‌నున్న ఈ సినిమా గురించి ఒక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఇందులో నితిన్ మూడు ర‌కాల గెట‌ప్పుల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌బోతున్నాడట‌. ఒక గెట‌ప్పులో అర‌వ‌య్యేళ్ల ముస‌లివాడిగా కూడా క‌నిపించాల్సి ఉంటుంద‌ట‌. గెట‌ప్పులంటే ఎలాంటివైనా వేస్కోవ‌చ్చు కానీ, యంగ్ హీరోలు ముసలోళ్గ గెట‌ప్పుల్లో మాత్రం అంత సుల‌భంగా సెట్ట‌వ‌డం క‌ష్టం. మ‌రి ఈ గెట‌ప్పుని ఎలా డిజైన్ చేశార‌న్న‌ది మాత్రం సినిమా మొద‌ల‌య్యాకే తెలిసేది.