ప్ర‌కృతికి విరుద్ధంగా వెళ్తోన్న నితిన్

Last Updated on by

అవునా.. నితిన్ అంతగా ఏం చేస్తున్నాడు..? ఆయ‌న ప్ర‌కృతితో ఎందుకు పెట్టుకుంటున్నాడు అనుకుంటున్నారా..? ఇక్క‌డే ట్విస్ట్ ఉంది క‌దా మ‌రి. ఈ రోజుల్లో ఓ సినిమా వ‌స్తుందంటే ఆస‌క్తి కంటే అనుమానాలే ఎక్కువ‌గా ఉంటాయి. ఎప్పుడు వ‌స్తుంది.. అస‌లు చెప్పిన టైమ్ కు వ‌స్తుందా రాదా అనే అనుమానాలు అంద‌ర్లోనూ క‌నిపిస్తుంటాయి. అందుకే త‌న సినిమాపై ముందుగా అంద‌రికీ ఆ అనుమానాలు తీర్చేసాడు నితిన్. ఈయ‌న న‌టిస్తోన్న 25వ సినిమా గుర్తుందా శీతాకాలం. కృష్ణ‌చైత‌న్య ద‌ర్శ‌కుడిగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని త్రివిక్ర‌మ్, ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిర్మిస్తుండ‌టం విశేషం. అందుకే సినిమాపై అంచ‌నాలు కూడా పెరిగిపోయాయి. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జ‌రుగుతుంది.

టైటిల్ చూస్తేనేమో ‘గుర్తుందా శీతాకాలం’ అంటూ సాఫ్ట్ గా చెబుతున్నాడు. కానీ విడుద‌ల మాత్రం వేస‌వి కాలం అంటున్నాడు. ఇది ప్ర‌కృతి విరుద్ధం కాదా..? మ‌ండే వేస‌విలో గుర్తుందా శీతాకాలం అంటూ వింటర్ ను గుర్తుచేయాలని చూస్తున్నాడు ఈ హీరో. ఇందులో కూడా లై ఫేమ్ మేఘాఆకాశ్ హీరోయిన్ గా న‌టిస్తుంది. ఫిబ్ర‌వ‌రి 12న సినిమా ఫ‌స్ట్ లుక్.. 14న వాలెంటైన్స్ డే కానుక‌గా టీజ‌ర్.. ఏప్రిల్ 5న సినిమా విడుద‌ల కానుంద‌ని అన్నింటిపై ఒకేసారి క్లారిటీ ఇచ్చాడు నితిన్. లై ఫ్లాప్ తో డీలాప‌డిన నితిన్.. గుర్తుందా శీతాకాలంతో ఏం మాయ చేస్తాడో చూడాలి..?

User Comments