నిజంగానే థ‌మ‌న్ మారిపోయాడ‌బ్బా

Last Updated on by

ఒక‌ప్పుడు థ‌మ‌న్ పాట‌లంటే పెద్ద‌గా ఆస‌క్తి చూపించేవాళ్లు కాదు. అదే రొటీన్ మ్యూజిక్ ఇస్తాడ‌ని తిట్టుకునేవాళ్లు. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ సంగీత ద‌ర్శ‌కుడిలో కూడా మార్పు వ‌చ్చింది. ఖచ్చితంగా ఏదో ఓ టైమ్ లో మారాల్సిన అవ‌స‌రం వ‌స్తుంది క‌దా ఇప్పుడు మారిపోయాడు థ‌మ‌న్. ఈయ‌న స్వ‌ర‌ప‌రిచిన పాట‌ల‌కు ఈ మ‌ధ్య మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. తొలిప్రేమ‌లో అన్నీ అద్భుతంగా అందించాడు థ‌మ‌న్. ఇప్పుడు ఛల్ మోహ‌న్ రంగ‌లో తొలిపాట విడుద‌లైంది. ఘా ఘా మేఘా అంటూ సాగిపోయే ఈ పాట‌కు కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. క్యాచీ ట్యూన్ ఇచ్చి కేక పెట్టించాడు థ‌మ‌న్.

నితిన్ స‌ర‌స‌న మేఘాఆకాష్ ఈ చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తుంది. కృష్ణ‌చైత‌న్య ద‌ర్శ‌కుడు. త్రివిక్రమ్ ఈ చిత్రానికి క‌థ అందించ‌డం విశేషం. ఆయ‌నే సినిమాకు నిర్మాత కూడా. ప‌వ‌న్ తో క‌లిసి సుధాకర్ రెడ్డి, త్రివిక్ర‌మ్ ఛ‌ల్ మోహ‌న్ రంగ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ఏప్రిల్ 5న ఛల్ మోహ‌న్ రంగ విడుద‌ల కానుంది. లై డిజాస్ట‌ర్ త‌ర్వాత నితిన్ న‌టిస్తున్న సినిమా ఇది. మేఘా ఆకాష్ తో వ‌ర‌స‌గా రెండోసారి జోడీ క‌ట్టాడు ఈ హీరో. మ‌రి వీళ్ల జోడీ రెండోసారైనా వ‌ర్క‌వుట్ అవుతుందో లేదో చూడాలి..!

User Comments