నితిన్ పెళ్లికి రాజుగారి ముహూర్తం..

అవును.. నితిన్ పెళ్లికొడుకు కాబోతున్నాడు. దీనికి ముహూర్తం పెడుతున్నది ఎవ‌రో కాదు.. దిల్ రాజు. ఇంత‌కీ నితిన్ పెళ్లికి దిల్ రాజు ముహూర్తం పెట్ట‌డం ఏంటి అనుకుంటున్నారా..? ఇక్క‌డే ఉంది అస‌లు ట్విస్ట్.. నితిన్ పెళ్లికొడుకు అవుతున్న‌ది రియ‌ల్ లైఫ్ లో కాదు.. రీల్ లైఫ్ లో. ఈయ‌న ప్ర‌స్తుతం కృష్ణ‌చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జ‌రుగుతుంది. నితిన్ ఈ చిత్రం త‌ర్వాత మ‌రో సినిమాకు క‌మిట‌య్యాడు. అది దిల్ రాజు బ్యానర్ లోనే. నితిన్ హీరోగా న‌టించిన దిల్ సినిమాతోనే నిర్మాత‌గా మారాడు రాజు. ఈ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో దాన్నే ఇంటిపేరుగా మార్చుకున్నాడు. దిల్ వ‌చ్చి 14 ఏళ్లైనా ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో సారి నితిన్ తో సినిమా చేయ‌లేదు రాజు. మ‌ధ్య‌లో మ‌రే సినిమా నిర్మించ‌లేదు.

దిల్ త‌ర్వాత నితిన్ తో దిల్ రాజుకు విభేధాలు వ‌చ్చాయ‌నే వార్త‌లు ఇండ‌స్ట్రీలో వినిపించాయి. అందుకే నితిన్ మ‌రో సినిమా చేయ‌లేదు ఎప్పుడు. ఇన్నేళ్ల త‌ర్వాత ఇప్పుడు మ‌ళ్లీ నితిన్ తో ఓ సినిమా నిర్మించ‌డానికి రెడీ అయ్యాడు రాజు. శ‌త‌మానం భ‌వ‌తి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఇచ్చిన స‌తీష్ వేగేశ్న‌తో నితిన్ సినిమా చేయ‌బోతున్నాడు. ఈయ‌న శ్రీ‌నివాస క‌ళ్యాణం టైటిల్ తో చాలా కాలం కిందే క‌థ సిద్ధం చేసాడు. ఇది హీరోలంద‌ర్నీ చుట్టి చివ‌రికి నితిన్ ద‌గ్గ‌రికి వ‌చ్చి ఆగింది. ఎన్టీఆర్ ఆల్ మోస్ట్ క‌న్ఫ‌ర్మ్ అనుకున్నా.. చివ‌రి నిమిషంలో నితిన్ వ‌చ్చి చేరిపోయాడు. ఇప్పుడు కృష్ణ‌చైత‌న్య త‌ర్వాత నితిన్ ఖాళీ. దాంతో ఈ హీరోనే త‌న క‌థ‌కు ప‌ర్ ఫెక్ట్ అని భావిస్తున్నాడు స‌తీష్. పైగా శ‌త‌మానం భ‌వ‌తి కూడా చాలా మంది హీరోలు కాద‌న్న త‌ర్వాత శ‌ర్వానంద్ ద‌గ్గ‌రికి వ‌చ్చి ఆగింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అవుతుందేమో మ‌రి..! మొత్తానికి ఏదేమైనా 14 ఏళ్ల త‌ర్వాత తొలి చిత్ర హీరోతో సినిమా నిర్మిస్తున్నాడు దిల్ రాజు. మ‌రి వీళ్ల సినిమా ఎలా ఉండ‌బోతుందో..?