ఏ స్టూడియోస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 2 గా యంగ్ హీరో నితిన్, రమేష్ వర్మ ప్రేమకథా చిత్రం

Last Updated on by

వైవిధ్యభరితమైన సినిమాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్ హీరో నితిన్ ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు.. ప్రేమకథా చిత్రంగా తెరకేక్కబోయే ఈ సినిమా షూటింగ్ ఆగస్ట్ లో ప్రారంభం చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.. నితిన్ నటించిన సూపర్ హిట్ సినిమాలు ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే సినిమా ల తరహాలోనే ఈ సినిమా సాగుతుంది.. రమేష్ వర్మ చెప్పిన లైన్ కి ఇంప్రెస్ అయిన నితిన్ వెంటనే ఈ ప్రాజెక్ట్ కి ఒకే అనడం విశేషం.. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా కి నటరాజన్ సుబ్రమణియన్ (నట్టి) సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.. ఏ స్టూడియోస్ బ్యానర్ పతాకంపై కోనేరు సత్యనారాయణ ఈ సినిమా ని నిర్మిస్తుండగా, హవీష్ లక్ష్మణ్ ప్రొడక్షన్ నిర్వహిస్తున్నారు.. త్వరలో చిత్ర నటీనటులను, సాంకేతిక నిపుణులను వెల్లడించనున్నారు..

నటీనటులు : నితిన్

సాంకేతిక నిపుణులు :

కథ, దర్శకత్వం : రమేష్ వర్మ

నిర్మాత : కోనేరు సత్యనారాయణ

బ్యానర్ : ఏ స్టూడియోస్

ప్రొడక్షన్ : హవీష్ లక్ష్మణ్ కోనేరు

మ్యూజిక్ : దేవి శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ : నటరాజన్ సుబ్రమణియన్ (నట్టి)

User Comments