ప‌వ‌న్ టైటిల్‌ని నితిన్ ఏం చేస్తున్నాడో తెలుసా?

Nithin Pawan Title
ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి నితిన్ వీరాభిమాని అనే విష‌యం తెలిసిందే. అందుకే త‌న ప్ర‌తి సినిమాలోనూ ఏదో ఒక్క స‌న్నివేశంలోనైనా ప‌వ‌న్ పేరుని ప్ర‌స్తావిస్తుంటాడు నితిన్‌. కొన్నిసినిమాల్లో ఆయ‌న పాట‌ల్ని రీమిక్స్ కూడా చేయించి వినిపించాడు. త‌న కాలేజ్ రోజుల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల్ని ఎంత ప్రేమ‌గా చూసేవాడో, ఇప్పుడు కూడా అదే త‌ర‌హాలోనే త‌న అభిమానాన్ని కురిపిస్తూనే ఉన్నాడు.  త‌న సినిమాల్లో ప‌వ‌న్‌ని వాడేయ‌డంలో మొద‌ట్నుంచీ ముందు వ‌ర‌సలో ఉన్న  నితిన్ ఇప్పుడు ఆ వాడ‌కాన్ని మ‌రోస్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలిసింది.
ప‌వ‌న్ తొలి చిత్రం `అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి` టైటిల్‌ని త‌న సినిమా కోసం వాడుకోబోతున్నాడ‌ట నితిన్‌. కాక‌పోతే ఆ పేరును కాస్త మార్చి `అక్క‌డ అబ్బాయి ఇక్క‌డ అమ్మాయి` అని త‌న సినిమాకి ఫిక్స్ చేయ‌బోతున్నాడ‌ట‌. నితిన్ క‌థానాయ‌కుడిగా కృష్ణ‌చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న చిత్రానికే ఆ పేరుని ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం. ఆ సినిమాకి త్రివిక్ర‌మ్‌, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. ప‌వ‌న్ కూడా సినిమాలో భాగం కాబ‌ట్టి ఆయ‌న్ని వాడుకోవ‌డానికి నితిన్‌కి మ‌రింత మంచి అవ‌కాశం ల‌భించిన‌ట్టైంది.  ప్ర‌స్తుతం లైలో న‌టిస్తున్న నితిన్, త్వ‌ర‌లోనే ఆ సినిమాని పూర్తి చేసి కొత్త చిత్రం కోసం రంగంలోకి దిగ‌బోతున్నారు.