ఫెయిల్యూర్‌పై నితిన్ రియ‌లైజేష‌న్‌

యంగ్ & డైన‌మిక్ హీరో నితిన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నేలేదు. ప్ర‌తిభ‌లో అత‌డి గురించి శంకించే ప‌నేలేదు. అయితే గ‌త కొంత‌కాలంగా నితిన్ కెరీర్ గ‌తి త‌ప్ప‌డంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అస‌లు నితిన్‌కి ఏమైంది? తెలివైన ఎంపిక‌ల‌తోనే ముందుకు వెళుతున్నా, ఎందుక‌ని ప‌రాజ‌యాలు వెంటాడుతున్నాయి? అన్న విశ్లేష‌ణ సాగుతోంది. కొన్ని తెలిసి చేసేవి.. మ‌రికొన్ని తెలియ‌క చేసేవి. మొత్తానికి ఫ్లాప్‌లు వ‌స్తున్నాయ్‌. లై, శ్రీ‌నివాస‌క‌ళ్యాణం ఎంపిక‌లు త‌న‌వే కాబ‌ట్టి, ఆ ఫ్లాప్ భారాన్ని తానే మోయాల‌ని భావిస్తున్నాడ‌ట‌.

వ‌రుస ఫ్లాప్‌ల‌కు కార‌ణాల్ని ఆరా తీస్తూ, కెరీర్‌ని విశ్లేషిస్తూ ఇక‌పై చేప‌ట్టాల్సిన మార్పుల‌పైనా త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్నాడ‌ట‌. ఇత‌ర హీరోల‌తో పోలిస్తే త‌న‌కు ద‌క్కుతున్న పాజిటివ్ ప్ర‌చారం శూన్యం. పాజ‌టివ్ క‌థ‌నాల కంటే వ్య‌తిరేక క‌థ‌నాలే త‌న‌పై ఎక్కువ వ‌స్తున్నాయ‌ని విశ్లేషించిన నితిన్ దానిని మార్చేందుకు ట్రై చేస్తున్నాడుట‌. తొలిగా త‌న పీఆర్ టీమ్‌ని బ‌లోపేతం చేసే దిశ‌గా స‌న్నాహాలు చేస్తున్నాడ‌ట‌. కొన్ని వ‌రుస విజ‌యాల త‌ర్వాత ఫ్లాప్‌లు ఇబ్బంది పెట్టినా ఇదంతా పెర్ఫెక్ష‌న్‌కి దారి తీస్తోంద‌ని విశ్లేషిస్తున్నారు. ప్ర‌తిసారీ పీఆర్‌ని మార్చ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉండ‌దు. అయితే టాలీవుడ్‌లో ఏ పీఆర్‌పై బ్యాడ్‌నేమ్ లేకుండా ఉందో గ్ర‌హించి నితిన్ ఎంపిక‌లు చేసుకోవాల‌ని నిపుణులు త‌న‌కు సూచించార‌ట‌. ప్ర‌స్తుతం పీఆర్‌ల‌పై క్రిటిక్స్ ఎంతో సీరియ‌స్‌గా ఉన్న నేప‌థ్యంలో జాగ్ర‌త్త‌గా నితిన్ ఈ నిర్ణ‌యం తీసుకోవాల‌ని సూచ‌న అందిందిట‌. మొత్తానికి త‌న సినిమాలతో నిర్మాత‌ల‌కు, హీరోయిన్ల‌కు వ‌చ్చేపాటి ప్ర‌చారం త‌న‌కు రాక‌పోవ‌డానికి అస‌లు కార‌ణం నితిన్ గ్ర‌హించిన‌ట్టే సీన్ చెబుతోంది.

User Comments