నితిన్‌తో ఛ‌లో ఛ‌లో అంటాడా?

Last Updated on by

స్టార్ డైరెక్ట‌ర్ల వ‌ద్ద శిష్య‌రికం చేసిన వాళ్ల‌లో ఎవ‌రూ పైకి రాలేదు. ద‌ర్శకులుగా నిరూపించుకోలేదన్న అపప్ర‌ద బ‌ల‌ప‌డిపోయింది. అయితే ఈ యువ ద‌ర్శ‌కుడు మాత్రం దానిని తిర‌గ‌రాస్తున్నాడు. ఎదురేలేని స్టార్ డైరెక్ట‌ర్‌ త్రివిక్ర‌మ్ వ‌ద్ద ప‌ని చేసిన వెంకీ కుడుముల అప్పుడే రెండో సినిమా చేస్తున్నారు.. ప్ర‌స్తుతం ప‌రిశ్ర‌మ‌లో ఇదో హాట్ టాపిక్‌. తేజ‌, త్రివిక్ర‌మ్ వ‌ద్ద శిష్య‌రికం చేసి, అటుపై ఛ‌లో చిత్రంతో హిట్ అందుకున్న వెంకీ కుడుముల తెలివిగా పావులు కదుపుతున్నాడు. ఇప్పుడు నితిన్‌తో రెండో సినిమా చేస్తున్నాడు. ఆ క్ర‌మంలోనే వెంకీ కుడుముల ఆస‌క్తిక‌ర ప‌య‌నంపై వాడి వేడిగా చ‌ర్చ సాగుతోంది.

వెంకీ కుడుముల అంద‌రిలానే బాగా పెద్ద చ‌దువులు చ‌దువుకున్నాడు. మేనేజ్‌మెంట్ విద్య‌లో ఆరితేరి ద‌ర్శ‌కుడ‌వ్వాల‌న్న కోరిక‌తో కృష్ణా న‌గ‌ర్‌లో అడుగుపెట్టాడు. అటుపై చాలామంది ద‌ర్శ‌కుల‌తో సాన్నిహిత్యం కోసం పాకులాడాడు. ఈ పాకులాట‌లో భాగంగా నేము, ఫేమున్న ద‌ర్శ‌కుల‌కు, చిన్నా చిత‌కా ద‌ర్శ‌కుల‌కు బ‌ర్త్‌డే లు తెలుసుకుని మ‌రీ కేక్‌లు కొనిచ్చాడు. అలా వ‌చ్చిన గుర్తింపు స్నేహంగా మారి చివ‌ర‌కు అత‌డు కూడా ద‌ర్శ‌కుడు అయ్యేందుకు సాయ‌మైంది. ప‌రిశ్ర‌మ‌లో ఆర్టిస్టులు, చిన్నాచిత‌కావాళ్లు త‌న‌కు అవ‌స‌రం అయిన‌ప్పుడు సాయం చేశారు. మంచిత‌నం, స్నేహంతోనే అత‌డికి తొలి అవ‌కాశం ద‌క్కింది. నాగ‌శౌర్య‌కు ఛ‌లో లాంటి బ్రేక్ ఇచ్చి అత‌డికి క్లోజ్ అయిపోయాడు. ఇప్పుడు ఏకంగా ఈ ద‌ర్శ‌కుడికి రెండో ఛాన్స్ ద‌క్కింది. ద్వితీయ ప్ర‌య‌త్నం నితిన్‌కి హిట్టించేందుకు త‌పిస్తున్నాడుట‌. నితిన్ న‌టించిన `శ్రీ‌నివాస‌క‌ళ్యాణం` ఆగ‌ష్టులో రిలీజ‌వుతుంది. అటుపై వెంకీతో సినిమా ప్రారంభం కానుంద‌ని తెలుస్తోంది.

User Comments