2020 స‌మ్మ‌ర్‌లో నితిన్ పెళ్లి బాజా

హీరో నితిన్ వివాహం వ‌చ్చే ఏడాది వేసవిలో జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఇంట్లో వాళ్లు వ‌ధువును వెతికారు. పెళ్లికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ని తెలుస్తోంది. ఇంత‌కీ ఈ యంగ్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ పెళ్లాడేది ఎవ‌రిని అంటే .. ప‌ద‌హార‌ణాల తెలుగ‌మ్మాయిని పెళ్లాడుతున్నాడ‌ట‌.

అలాగే నితిన్ పెళ్లాడే అమ్మాయికి ప‌రిశ్ర‌మ‌తో ఎలాంటి రిలేష‌న్ లేదు. నితిన్ చాలా కాలంగా త‌న‌ని ప్రేమిస్తున్నాడు. ఇక పెళ్లితో ఒక‌టి కాబోతున్నాడు. వ‌ధువుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డించాల్సి ఉంది. అలాగే ఈ పెళ్లికి సంబంధించి నితిన్ ఫ్యామిలీ నుంచి అధికారికంగా ఎలాంటి వివ‌రం లేదు. నితిన్ న‌టించిన భీష్మ త్వ‌ర‌లో రిలీజ్ కి రానుంది. రంగ్ దే  అనే చిత్రంలోనూ నితిన్ న‌టించనున్నాడు.