నితిన్ మాటిచ్చాడు..మంత్ ఎండ్ కి అన్ని!

Last Updated on by

యంగ్ హీరో నితిన్ ని వ‌రుస ప‌రాజ‌యాలు వేదిస్తున్నాయి. `లై`, `ఛ‌ల్ మోమ‌న రంగ‌`, `శ్రీనివాస్ క‌ళ్యాణం`తో తో హ్యాట్రిక్ ప్లాప్ లు చూసాడు. దీంతో త‌దుప‌రి క‌థ‌ల విష‌యంలో జాగ్ర‌త్తలు ఎక్కువ‌య్యాయి. ఈ ప్రోస‌స్ లో టైమ్ కూడా అంతే ఎక్కువ‌గా తీసుకున్నాడు. చివ‌రిగా `ఛ‌లో` ద‌ర్శ‌కుడు వెంకీ కుడుమ‌ల‌తో `భీష్మ` చేయ‌డానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చి కొన్ని నెల‌లు గ‌డుస్తోంది. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ ఆ సినిమా ప‌ట్టాలెక్కింది లేదు. ఇదిగో తోక..అదుగో పులి అన్న‌ట్లు సినిమా ప్రారంభం అవుతుంద‌ని ప్ర‌చారం సాగింది గానీ, ఇంకా ప్రీ ప్రోడ‌క్ష‌న్ స్టేజ్ లో ఉంద‌ని మ‌రోసారి నితిన్ క్లారిటీ ఇచ్చాడు. ప‌క్కా ప్రామిస్.. అతి త్వ‌ర‌లో షూటింగ్ స్టార్ట్ అవుతుంద‌ని తెలిపాడు. అలాగే ఇదే ఏడాది రెండు సినిమా రిలీజ్ ల‌తో ఖుషీ చేయ‌డం ఖాయ‌మ‌ని వెల్ల‌డించాడు.

వాట‌న్నింటిపై ఈనెల‌ఖ‌రుక‌ల్లా క్లారిటీ వ‌స్తుంద‌ని, అప్ప‌టివ‌ర‌కూ అభిమానులు కూల్ గా ఉండాల‌ని, డిలేకు క్ష‌మాప‌ణ‌లు కూడా తెలిపాడు. ఈ నేప‌థ్యంలో వెంకీ కుడుముల కాకుండా నితిన్ ఎంచుకున్న రిమైనింగ్ ద‌ర్శ‌కులు ఎవ‌ర‌న్న దానిపై స‌స్పెన్స్ మొద‌లైంది. ఇప్ప‌ట‌కిఏ నితిన్ ప్లాప్ ల్లో కూరుకుపోయాడు. `భీష్మ` తో క‌చ్చితంగా స‌క్సెస్ కొట్టి గ‌త వైభ‌వాన్ని అందుకోవాలి. లేదంటే మార్కెట్ పై మ‌రింత ప్ర‌భావం చూప‌డం ఖాయం. నితిన్ సినిమాలంటే లైట్ తీసుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. మ‌రి వాట‌న్నింటిని అధిగ‌మిస్తాడా? లేదా? అన్నది తెలియాలంటే కొన్ని నెల‌లు వెయిట్ చేయాల్సిందే.

User Comments