నితిన్ – ఏలేటి టైటిల్ ఇంట్రెస్టింగ్

Interesting Title For Nithin Next

యూత్ స్టార్ నితిన్ క‌థానాయ‌కుడిగా వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో `భీష్మ‌` సెట్స్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆ సినిమా చిత్రీక‌ర‌ణ వేగంగా పూర్త‌వుతోంది. త‌దుప‌రి చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి.. వేణు శ్రీరామ్ లతో నితిన్ సినిమాలు చేయ‌నున్నాడు. రెండు ప్రాజెక్ట్ లు ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉన్నాయి. ముందుగా చంద్ర‌శేఖ‌ర్ ఏలిటి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నాడు. ఇప్ప‌టికే హీరోయిన్లుగా ర‌కుల్ ప్రీత్ సింగ్.. ప్రియా ప్రకాష్ వారియ‌ర్ ని ఎంపిక చేసారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మ‌రో అప్ డేట్ అందింది.

ఈ క్రేజీ చిత్రానికి ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఎంచుకున్న కథాంశం.. అందులో పాత్ర‌ల‌కు త‌గ‌ట్టు ఈ చిత్రానికి చ‌ద‌రంగం అనే టైటిల్ అయితే బాగుంటుంద‌ని భావిస్తున్నారుట‌. చంద్ర శేఖ‌ర్ ఏలేటి క‌థాంశాలు యూనిక్ గా ఉంటాయి. రెగ్యుల‌ర్ ఫార్మెట్ లో ఆయ‌న సినిమాలుండ‌వు. ఆయ‌న గ‌త సినిమాలు ఐతే, అనుకోకుండా ఒక‌రోజు, ఒక్క‌డున్నాడు, ప్ర‌యాణం, సాహ‌సం వేటిక‌వే ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న టైటిల్స్. విమ‌ర్శ‌కులు ప్ర‌శంస‌లందుకున్న చిత్రాల‌వి. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ లాభాలు తీసుకురాక‌పోయినా న‌ష్టాలైతే లేవు. ప్ర‌స్తుతం ప్రేక్ష‌కుల‌ అభిరుచులు కూడా మారుతోన్న నేప‌థ్యంలో చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి లాంటి ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ల‌కి మంచి రోజులు వ‌చ్చిన‌ట్లే.