నితిన్ సూప‌ర్ షాక్ ఇచ్చాడుగా

క్లాస్ సినిమా అన్నారు.. గుర్తుందా శీతాకాలం అన్నారు.. ఈ మ‌ధ్య కాలంలో ఎప్పుడూ రానంత ఫ్రెష్ ల‌వ్ స్టోరీ అన్నారు.. ఇన్ని చెప్పి చివ‌రికి టైటిల్ తో సూప‌ర్ షాక్ ఇచ్చాడు నితిన్. త‌న సినిమాకు ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఛ‌ల్ మోహ‌న‌రంగ అంటూ డిఫెరెంట్ టైటిల్ పెట్టుకున్నాడు నితిన్. ఈ టైటిల్ ను ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ విడుద‌ల చేయ‌డం విశేషం. నిజానికి ఈ చిత్రానికి ఆయ‌న కూడా ఓ నిర్మాతే. నితిన్ తండ్రి సుధాక‌ర్ రెడ్డి, స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ తో క‌లిసి ఛ‌ల్ మోహ‌న‌రంగ‌ను నిర్మిస్తున్నాడు ప‌వ‌ర్ స్టార్. అందుకే నితిన్ సినిమాను ప్ర‌మోట్ చేస్తున్నాడు. అంతేకాదు.. ఈ చిత్ర క‌థ ఇచ్చింది త్రివిక్ర‌మ్. కృష్ణ‌చైత‌న్య దానికి త‌నదైన శైలిలో మార్పులు చేసాడు. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ఫిబ్ర‌వ‌రి 14న టీజ‌ర్ విడుద‌ల కానుంది.

ప్రేమికుల రోజు సంద‌ర్భంగా త‌న ప్రేమ‌ను చెప్ప‌బోతున్నాడు నితిన్. ఇక సినిమాను ఏప్రిల్ 5న విడుద‌ల చేయ బోతున్నారు. మేఘాఆకాశ్ ఈ చిత్రంలో మ‌రోసారి నితిన్ తో రొమాన్స్ చేసింది. లై సినిమా ఫ్లాప్ అయినా కూడా వీళ్ల కెమిస్ట్రీ మాత్రం అదిరింది. ఆ కార‌ణంతోనే మ‌రో ఛాన్స్ ఇచ్చాడు నితిన్. ఈ చిత్రం ఖచ్చితంగా నితిన్ కెరీర్ కు ఊపిరి ఊదాల్సిందే. ఎందుకంటే వ‌ర‌స ఫ్లాపుల‌తో మ‌నోడు బాగా వెన‌క బ‌డిపోతున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఇష్క్, గుండెజారి త‌ర్వాత అ..ఆ మాత్ర‌మే ఆడింది. మ‌ధ్య‌లో వ‌చ్చిన నాలుగు సినిమాలు ఫ్లాపే. దాంతో ఈ హీరోకు ఇప్పుడు అర్జంట్ గా హిట్ ప‌డాల్సిందే. చ‌ల్ మోహ‌న‌రంగ ఆ ఆశ‌ల్ని నిల‌బెడుతుంద‌నే ఆశ‌తోనే ఉన్నాడు నితిన్.

User Comments