ఎన్టీఆర్‌లో మ‌హాన‌టిగా నిత్యా

Last Updated on by

బాలకృష్ణ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తూ నిర్మిస్తున్న‌ సినిమా ఎన్టీఆర్. క్రిష్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో విద్యాబాలన్, రానా, ప్ర‌కాష్‌రాజ్‌, క‌ళ్యాణ్‌రామ్‌, సుమంత్‌, ర‌కుల్‌, రాశీ ఖ‌న్నా త‌దిత‌రులు నటిస్తున్నారు. అలాగే అతిధి పాత్రల్లో కూడా కొందరు ప్రముఖ నటీనటులు కనిపించనున్నారు. అయితే గ‌త కొంత‌కాలంగా మహానటి సావిత్రి పాత్రలో ఎవ‌రు న‌టిస్తారు? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. ఈ పాత్ర‌లో జూ.సౌంద‌ర్య‌ నిత్యామీనన్ నటించనుంద‌ని తెలుస్తోంది. నందమూరి తారకరామారావు- సావిత్రి జంట‌గా చాలా సినిమాల్లో నటించారు. అవ‌న్నీ గొప్ప‌ క్లాసిక్ చిత్రాలుగా నిలిచాయి, మాయాబజార్, మిస్సమ్మ, రక్త సంబంధం వంటి క్లాసిక్స్‌ని తెలుగు ప్ర‌జ‌లు అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. ఎన్టీఆర్ బయోపిక్ లో ఈ చిత్రాల ప్రస్తావన త‌ప్ప‌నిస‌రి కావ‌డంతో సావిత్రి పాత్ర‌ధారి అంతే ఇంపార్టెంట్ అని క్రిష్ భావించి ఆ పాత్ర‌కు నిత్యామీనన్ ను ఎంపిక చేసుకున్నార‌ట‌. మాయాబజార్ సినిమాలోని శశిరేఖగా, మిస్సమ్మ సినిమాలోని మేరీ పాత్రలో, రక్తసంబంధం చిత్రంలోని అభిన‌య‌నేత్రిగా నిత్యా ఎలా అభిన‌యించ‌నుందో చూడాలి. జనవరి 9న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. కీర‌వాణి బాణీలు అందిస్తున్నారు.

User Comments