బొద్దుత‌నంలో `నిత్య‌`వ‌సంతం?

Last Updated on by

నిత్యామీన‌న్‌లో రెండు కోణాలు ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించుకోవాలి. ఒక‌టి సౌంద‌ర్య‌లా బొద్దుత‌నంతో తెలుగు సినీప‌రిశ్ర‌మ‌ను ఏల‌డం.. రెండోది ఎంత పెద్ద స్టార్ హీరో అయినా నేను న‌టించ‌ను! అని సూటిగా చెప్పేసే డేరింగ్ & డ్యాషింగ్ యాటిట్యూడ్‌. ప్ర‌భాసా ఆయ‌నెవరు? అని ప్ర‌శ్నించినా, అంత ముదురు హీరో వెంక‌టేష్‌తో న‌టించ‌ను అని సూటిగా చెప్పేసినా నిత్యాకే చెల్లింది. పురుషాధిక్య ప్ర‌పంచం స‌హించ‌ని ప్ర‌పంచంలో లేగ లేడిపిల్ల‌లా ప్ర‌వేశించిన నిత్యా మ‌న స్టార్ హీరోల‌పై అంత ఘాటుగా స్పందించడం వెన‌క అమాయ‌క‌త్వం దాగుంద‌న్న‌ది న‌గ్న‌స‌త్యం. దీనిపై అప్ప‌ట్లో ప్ర‌త్యేక చ‌ర్చా వేదిక న‌డిచింది.

క‌ట్ చేస్తే.. `అలా మొద‌లైంది` టైమ్‌కి ఇప్ప‌టికి నిత్యాలో ఎంతో ప‌రిణ‌తి. త‌న డ్యాషింగ్ యాటిట్యూడ్ కెరీర్‌కి ఏమంత అడ్డంకి కాలేదు స‌రిక‌దా.. నిత్య‌వ‌సంతంలా దూసుకుపోయేందుకు అక్క‌ర‌కొచ్చింది. కుర్ర‌హీరోలంతా జోలె ప‌ట్టి నిత్యాకి వెల్‌కం చెప్పారు. వ‌రుస‌గా నిత్యాతో న‌టించేందుకు త‌హ‌త‌హ‌లాడారు. నిత్యా అంగీక‌రించ‌లేదు కానీ, స్టారాధిస్టార్లు అంద‌రి స‌ర‌స‌న అవ‌కాశాలు ద‌క్కించుకునేదే. ఇప్ప‌టికీ కెరీర్‌ని ఎంతో సెల‌క్టివ్‌గానే న‌డిపిస్తున్న నిత్యా.. ఇటీవ‌లి కాలంలో ఓ పెళ్ల‌యిన హీరోతో రొమాన్స్ చేస్తోంద‌న్న ప్ర‌చారం సాగింది. ఆ క్ర‌మంలోనే నిత్యాకు అవ‌కాశాలు త‌గ్గాయ‌ని చెప్పుకున్నారు. అందులో నిజం ఎంత? అన్న‌ది అటుంచితే, నిత్యాలో ఇటీవ‌ల వ‌చ్చిన మార్పులు చూస్తుంటే అస‌లేం జ‌రుగుతోంది? అన్న సందేహం క‌ల‌గ‌క‌మాన‌దు. గొప్ప స్టార్‌డ‌మ్‌తో అసాధార‌ణంగా ఓ వెలుగువెలిగిన నిత్యా కి ఇప్ప‌టికీ ఏమాత్రం క్రేజు త‌గ్గ‌క‌పోయినా కొత్త కొత్త ప్రాజెక్టుల‌కు ఎందుకు అంగీక‌రించ‌డం లేదు? అంతేకాదు.. మారిన ఈ బొద్దుత‌నం వెన‌క అస‌లు రీజ‌న్ ఏంటి? అంటూ ఒక‌టే ప్ర‌శ్న‌లు. మ‌రి వీట‌న్నిట‌కీ నిత్యా ఏం సమాధానం చెబుతుందో చూడాలి. నిత్యా ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్క‌డ‌!

User Comments