నిత్యా .. నో కండిష‌న్స్ ప్లీజ్!

Last Updated on by

నిత్యామీన‌న్ టాలీవుడ్ కెరీర్ పూర్తిగా జీరో అయిపోయింది. మ‌ల‌యాళం మిన‌హా తెలుగు, త‌మిళంలో పెద్ద‌గా సినిమాలేవీ లేవు. ఇక్క‌డ కొంత‌వ‌ర‌కే ప‌రిమిత‌మైంది. ది బెస్ట్ పెర్ఫామ‌ర్ గా పేరు తెచ్చుకుని కొన్ని త‌ప్పులు చేయ‌డం వ‌ల్ల వెన‌క‌బ‌డింది. కొన్ని ప‌రిమితులు త‌న‌కు అడ్డంకిగా మారాయి. క్లీవేజ్ షోలు, గ్లామర్ పాత్ర‌లు చేయ‌నంటూ మ‌డి క‌ట్టుకుని కూచోవ‌డంతో ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ఆ దిశ‌గా ఎంక‌రేజ్ చేయలేదు. వ్య‌క్తిగ‌తంగాను సూటిగా ఉంటుంద‌న్న‌ రూమ‌ర్ మైన‌స్‌. వీట‌న్నింటి కార‌ణంగా టాలీవుడ్ ద‌ర్శ‌కులు దూరం పెట్టార‌న్న‌ది ఓ టాక్.

ప్రస్తుతం నిత్యా ఏం చేస్తోంది? అంటే.. .కోలీవుడ్, మాలీవుడ్ లో ఓ రెండు సినిమాలు చేస్తోంది. అలాగే బాలీవుడ్ లో `మిష‌న్ మంగ‌ళ్` లోనూ న‌టిస్తోంది. త‌మిళంలో జ‌య‌ల‌లిత బ‌యోపిక్ లో న‌టిస్తూ వేడి పెంచుతోంది. ఈ గ్యాప్ లోనే అమ్మ‌డికి ఓ వెబ్ సిరీస్ లో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. హిందీ వెబ్ సిరీస్ `బ్రీత్` సీజ‌న్-1 మంచి స‌క్సెస్ అవ్వ‌డంతో సీజ‌న్ -2 కి రంగం సిద్ద‌మ‌వుతోంది. ఇందులో అబిషేక్ బ‌చ్చ‌న్ హీరోగా న‌టిస్తున్నాడు. ఆయ‌న‌కు జోడీగానే నిత్య‌ను ఎంపిక చేసారని బాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. అయితే సినిమాల్లో మాదిరి బ్రీత్ లో మ‌డిక‌ట్టుకుని కూర్చుంటానంటే కుద‌ర‌దని నిర్వాహ‌కులు ముందే కండిష‌న్ పెట్టారుట‌. ద‌ర్శ‌కులు చెప్పిన‌ట్లు న‌డుచుకోవాల‌ని, అవ‌స‌ర‌మైన చోట‌ ఇంటిమేట్ స‌న్నివేశాల్లోనూ న‌టించాల‌ని క‌రాఖండీగా చెప్పేసారుట‌. బాలీవుడ్ ఆఫ‌ర్ కావ‌డంతో నిత్య సై అనేసింది.


Related Posts