క్లాసిక్ డ్యాన్స‌ర్‌గా ప్ర‌యోగం

Last Updated on by

మ‌ల‌యాళీ సోయ‌గం నివేధ థామ‌స్ న‌టించిన 118 ఇటీవ‌లే రిలీజై స‌క్సెసైన సంగ‌తి తెలిసిందే. తాజాగా నివేద న‌టించిన‌ సినిమా `బ్రోచేవారెవ‌రురా`. `చ‌ల‌న‌మే చిత్ర‌ము చిత్ర‌మే చ‌ల‌న‌ము` అనే ఆస‌క్తిక‌ర ఉప‌శీర్షిక‌ను నిర్ణ‌యించారు. శ్రీ‌విష్ణు, స‌త్య‌దేవ్, నివేద పెథురాజ్ ప్ర‌ధాన పాత్ర‌దారులు. వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌కుడు. మ‌న్యం ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై విజ‌య్ కుమార్ మ‌న్యం నిర్మిస్తున్నారు. మేలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌చారంలోనూ వేగం పెంచింది టీమ్.

తాజాగా నివేద థామ‌స్ తొలి లుక్ ని రిలీజ్ చేసింది. ఈ పోస్ట‌ర్ లో నివేద క్లాసిక్ డ్యాన్స‌ర్ గా అద్భుత‌మైన లుక్ తో ద‌ర్శ‌న‌మిచ్చింది. ఈ చిత్రంలో నివేద పాత్ర పేరు మిత్ర‌. ఇండిపెండెంట్ ఉమెన్.. ఆత్మ విశ్వాసంతో ఎదిగే అమ్మాయిగా క‌నిపించ‌నుంది. ఈ లుక్ త‌న కెరీర్ లోనే ఎంతో ప్ర‌త్యేకం అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంలో ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు సాగుతున్నాయి. తాజా లుక్ తో వేడి పెంచ‌డంలో బ్రోచేవారెవ‌రురా టీమ్ స‌క్సెసైంది. నివేద ఈ చిత్రానికి అస‌లైన బ్యాక్ బోన్ అని అర్థ‌మ‌వుతోంది. శ్రీ‌విష్ణు లాంటి ట్యాలెంటెడ్ పెర్ఫామ‌ర్ మ‌రో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌తో మెప్పిస్తాడ‌నే భావిస్తున్నారు. ఇక టైటిల్ ప‌రంగానూ సౌండింగ్ ఇంట్రెస్టింగ్ అన్న టాక్ ఫిలింస‌ర్కిల్స్ లో వినిపిస్తోంది. మేలో రిలీజ్ కి వ‌స్తోంది కాబ‌ట్టి మునుముందు మ‌రిన్ని విష‌యాల్ని టీమ్ రివీల్ చేస్తుందేమో వేచి చూడాలి.

Also Watch : Naga Chiatanya’s Latest Stills From Majili

User Comments