ఎన్టీఆర్ అనగానే నడుం అందాలు బయటపెట్టిందా?

గ్లామర్ ఫీల్డ్ లో బోల్డ్ గా కనిపించకపోయినా పర్లేదు కాని, నడుము అందాలను మాత్రం ప్రదర్శించాలి అంటారు. అలా కూడా చేయకపోతే.. టాలెంట్ ఎంత ఉన్నా పెద్ద పెద్ద సినిమా ఆఫర్స్ రావడం కష్టమే. ఈ విషయం మలయాళీ టాలెంటెడ్ బ్యూటీ నివేధా థామస్ కు ఇటీవలే అర్ధమయ్యి ఉంటుంది. అందుకే కాస్తంత గ్లామర్ ను ప్రదర్శించడం మొదలెట్టింది. నానితో జెంటిల్మెన్, నిన్ను కోరి సినిమాల్లో నటించిన నివేధా కాస్త సంప్రదాయంగా కనిపించింది.  ఈ రెండింటిలోనూ ఈ అమ్మడు తన యాక్టింగ్ టాలెంట్ తో కట్టిపడేసింది. ఈ టాలెంట్ ఇప్పుడు ఎంతవరకు పనికి వచ్చిందంటే.. ఎన్టీఆర్ లాంటి బడా హీరోతో సినిమా చేసే ఛాన్స్ వరకు పనికొచ్చింది.
మరిప్పుడు ఈ సినిమాలో గ్లామర్ చూపించకపోతే కష్టం కదా. అందుకే కొంచెం రూటు మార్చి.. నడుము వంపులను ప్రదర్శించేందుకు సిద్దమైంది. ఈ విషయం ఇటీవలే ట్రైలర్ రిలీజైనప్పుడు అర్ధం అయింది. అంతేకాదు, ఈ అమ్మడు ఇటీవలే ఓ షాప్ ఓపెనింగ్ సమయంలో కూడా కాస్త నడుము వంపులు కనిపించే విధంగా ప్రయత్నం చేయడంతో అందరూ విషయాన్ని అర్థం చేసేసుకుంటున్నారు. ఎంతైనా గ్లామర్ ఫీల్డ్ కదా. ఆ మాత్రం అందాలను ప్రదర్శించకపోతే.. అవకాశాలు రావొద్దు. అయితే, నివేదా పర్సనాలిటీ పరంగా ఎక్కువగా అందాలను చూపించలేదనట్లుగా కనిపించినా.. ఇప్పుడు మాత్రం తన నడుం అందాలనే నివేదా ఆయుధంగా మార్చుకోవడం విశేషం అనే అనాలి. మొత్తంగా యాక్టింగ్ టాలెంట్ తో పాటు ఇలా కొంచెం గ్లామర్ ను కూడా మిక్స్ చేసిందంటే.. ఇంక నివేదాను ఆపడం కష్టమే.