ఎన్టీఆర్ వ‌ర్సెస్ ఏఎన్నార్‌

Last Updated on by

అన్న‌గారు ఎన్టీఆర్ సినిమాకు తొలి నుంచి ఏదో ఒక అడ్డంకి ఎదుర‌వుతున్న సంగ‌తి తెలిసిందే. బాలారిష్టాల‌ను ఎదుర్కొని ఎట్ట‌కేల‌కు ఈ సినిమా చిత్రీక‌ర‌ణ స‌జావుగా సాగుతోంది. ఇలా మొద‌లు పెట్టారో లేదో ఇంత‌లోనే ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్త‌యింద‌ని చెబుతున్నారు. దీన్ని బ‌ట్టి క్రిష్ ఎంత వేగంగా చిత్రీక‌ర‌ణ సాగిస్తున్నారో అర్థం చేసుకోవ‌చ్చు. ఎన్టీఆర్ పాత్ర‌లో బాల‌య్య‌, బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో విద్యాబాల‌న్ న‌టిస్తున్నారు. విద్యా ఇటీవ‌లే సెట్స్‌లో జాయిన్ అయిన సంగ‌తి విదిత‌మే.

ఇక‌పోతే ఎన్టీఆర్ సినీజ‌ర్నీ స్నేహితుడు, ఎంతో కీల‌క పాత్రధారి అయిన ఏఎన్నార్ గా ఎవ‌రు న‌టిస్తున్నారు? అన్న‌దానికి ఇప్ప‌టివ‌ర‌కూ స‌రైన ఆన్స‌ర్ లేదు. ఈ పాత్ర‌లో నాగ‌చైత‌న్య న‌టిస్తార‌ని, లేదూ సుమంత్ న‌టించే ఛాన్సుంద‌ని వార్త‌లొచ్చాయి. కానీ ఏదీ క‌న్ఫామ్ కాలేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. అస‌లు ఈ పాత్ర‌లో ఎవ‌రూ న‌టించే ఆస్కారం లేద‌ని తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ మూవీలో ఏఎన్నార్ పాత్ర లేక‌పోవ‌డ‌మేంటో అభిమానుల‌కు మాత్రం క‌న్ఫ్యూజ‌న్‌గా ఉంది. దీనిపై యూనిట్ అధికారికంగా వివ‌ర‌ణ ఇస్తుందేమో చూడాలి.

User Comments