రోబో-2 ఇంకా సందిగ్ధంలోనే!

Last Updated on by

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ – శంక‌ర్ కాంబినేష‌న్ మూవీ `2.ఓ` (రోబో2) రిలీజ్ ఇప్ప‌టికీ ఓ స‌స్పెన్స్‌. 2019 జ‌న‌వ‌రిలో ఈ సినిమా రిలీజ‌వుతుంద‌ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ అధికారికంగా ధృవీక‌రించిందేం లేదు. ఇప్ప‌టికీ రిలీజ్ తేదీ ఓ స‌స్పెన్స్‌. అయితే అలా ఎందుకు జ‌రుగుతోంది అంటే.. దానికి ప్ర‌త్యేక కార‌ణం ఉంద‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది. అస‌లు ఈ సినిమా రిలీజ్ తేదీ ఫ‌లానా అని ప‌క్కాగా క‌న్ఫ‌మ్ చేసేయాలంటే, ముందు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్, వీఎఫ్ఎక్స్‌, మిక్సింగ్, 3డి ఎఫెక్ట్స్‌ వంటి ప‌నులు పూర్త‌వ్వాలి క‌దా? ఆ ప‌నులేవీ ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క అడుగు కూడా ముందుకు ప‌డ‌లేదుట‌. స‌ద‌రు అమెరికా కార్పొరెట్ కంపెనీ ఇచ్చిన బాధ్య‌త‌ల్ని నెర‌వేర్చ‌డంలో ప‌క్కాగా ఫెయిల‌వ్వ‌డంతో అంతా డ‌బుల్ ప‌ని చేయాల్సొస్తోంది. ఇప్ప‌టికే చేసిన ఎఫెక్ట్స్ వ‌ర్క్ అంతా తిరిగి చేస్తోంది స‌ద‌రు కంపెనీ. ఆ ప‌ని పూర్త‌వ్వ‌డానికి ఇంకా కొన్ని నెల‌లు ప‌డుతుంద‌ని చెబుతున్నారు. ఫ‌లానా టైమ్‌కి అయిపోతుంది అని మాత్రం చెప్ప‌డం లేదు.

ఇక‌పోతే అత్య ంత కీల‌క‌మైన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు అస‌లే మొద‌లు కాలేదని బాలీవుడ్ హంగామా పోర్ట‌ల్‌ రివీల్ చేసింది. మిక్సింగ్ ప‌నులు ఎక్క‌డికక్క‌డే పెండింగులో ఉన్నాయ‌ని, 3డి ఎఫెక్టుల‌కు సంబంధించిన ప‌నులు జూన్‌-జూలై నాటికి పూర్త‌వుతాయని స‌ద‌రు పోర్ట‌ల్ పేర్కొంది. ఈ ప‌నుల‌న్నిటికీ శంక‌ర్ బృందం ఆగ‌ష్టును ప‌క్కాగా డెడ్‌లైన్ అంటూ చెబుతున్నా.. అప్ప‌టికి పూర్త‌వుతాయా? అన్న సందేహం వ్య‌క్తం చేసింది. ఏదేమైనా అంతటి భారీ చిత్రానికి ఇలాంటి చిక్కులు త‌ప్ప‌నిస‌రి. ఇబ్బ ందులు ఎదుర్కొన్నా మెరుగైన సినిమాని అందించ‌డ‌మే ధ్యేయంగా శంక‌ర్ బృందం ప‌ని చేస్తోంది. అయితే రిలీజ్ అంత‌కంత‌కు వాయిదా ప‌డుతుండ‌డంతో ర‌జ‌నీ, శంక‌ర్ ఇరువురి ఫ్యాన్స్ తీవ్ర నిరాశ‌లో ఉన్నారు. క‌నీసం 2019 సంక్రాంతి నాటికైనా ఈ క్రేజీ సినిమాని చూడాల‌ని అంతా త‌హ‌త‌హ‌లాడుతున్నారు. మ‌రి చూద్దాం.. ఇక‌నైనా డెడ్‌లైన్ ప్ర‌కారం ప‌నుల‌న్నీ పూర్త‌వుతాయేమో?

User Comments