బాప్‌రే.. మ‌న‌కి ప‌ద్మ యోగమే లేదే

Padma awards 2020, Nothing for tollywood

కేంద్ర ప్ర‌భుత్వం యేటా ప‌ద్మ పుర‌స్కారాల్ని ప్ర‌క‌టిస్తుంటుంది. వివిధ రంగాల్లాగే.. కళారంగంలో కీల‌క‌మైన సినిమా విభాగానికి కూడా పుర‌స్కారాలు ల‌భిస్తుంటాయి. గ‌తేడాది తెలుగులో సిరివెన్నెల సీతారామ‌శాస్త్రికి ప‌ద్మ‌శ్రీ వ‌చ్చింది. అంత‌కుముందు జ‌క్క‌న్న రాజ‌మౌళికి కూడా అదే గౌర‌వం అందుకున్నారు. ఈసారి కూడా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మని ప‌ద్మ పుర‌స్కారాలు వ‌రించొచ్చ‌ని అనుకున్నారంతా. కైకాల‌, కృష్ణంరాజుతోపాటు చాలా మందే సీనియ‌ర్ న‌టులున్నారు కాబ‌ట్టి వాళ్ల‌లో ఎవ‌రికో ఒక‌రికి పుర‌స్కారం ద‌క్కొచ్చ‌ని అనుకున్నారు. కానీ తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఒక్క‌రికీ కూడా ఆ యోగం ద‌క్క‌లేదు. మ‌నకుతెలిసిన సినీ ప్ర‌ముఖుల్లో బాలీవుడ్‌కి చెందిన ప్ర‌ముఖులు కంగ‌న ర‌నౌత్‌, క‌ర‌ణ్‌జోహార్‌, ఏక్తాక‌పూర్‌, అద్నాన్‌స‌మిల‌కి మాత్ర‌మే ఈసారి ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారాలు ద‌క్కాయి. ఏక్తాక‌పూర్‌, క‌ర‌ణ్‌లాంటి యువ నిర్మాత‌ల‌కి ద‌క్కిన గౌర‌వం మాకెందుకు ద‌క్క‌లేద‌ని చాలామంది దక్షిణాది సినీ ప్ర‌ముఖులు నిరాశ‌ని వ్య‌క్తం చేస్తున్నారు.