`విశ్వ‌రూపం2` ఆన్‌టైమ్‌లోనే

Last Updated on by

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ న‌టించిన `విశ్వ‌రూపం 2` ఆగ‌స్టు 10న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో ఈ చిత్రం భారీ స్క్రీన్ల‌లో రిలీజ‌వుతోంది. అయితే ఈ సినిమా త‌మిళ రిలీజ్ వాయిదా ప‌డింది! అంటూ ఇటీవ‌ల ప‌లు పుకార్లు షికారు చేశాయి. ఈ సినిమా త‌మిళ రిలీజ్‌ని స‌వాల్ చేస్తూ పిర‌మిడ్ సైమ‌రా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ కోర్టుకెక్క‌డంతో వాయిదా వేశార‌ని ప్ర‌చారం సాగింది. దీనిపై క‌మ‌ల్ హాస‌న్ స్వ‌యంగా వివ‌ర‌ణ ఇచ్చారు.

`విశ్వ‌రూపం 2` రిలీజ్ వాయిదా ప‌డ‌లేదు. తెలుగు, త‌మిళ్‌లో ముందే నిర్ణ‌యించిన తేదీకే రిలీజ్ చేస్తున్నామ‌ని చిత్ర క‌థానాయ‌కుడు, నిర్మాత క‌మ‌ల్‌హాస‌న్ స్వ‌యంగా వెల్ల‌డించారు. తమిళంలో ఈ చిత్రాన్ని `ఆస్కార్ ఫిలింస్` ద్వారా రిలీజ్ చేస్తున్నారు. వివాదంపై నేడు కోర్టుకు క‌మ‌ల్ హాస‌న్ వివ‌ర‌ణ ఇవ్వ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇదివ‌ర‌కూ `ప‌ద్మావ‌త్ 3డి` విష‌యంలోనూ ఈ త‌ర‌హా కోర్టు వివాదాలు నెల‌కొని చివ‌రికి విజ‌య‌వంతంగా రిలీజైన సంగ‌తి తెలిసిందే. ఈ వివాదాల వ‌ల్ల ఆ సినిమాకి క్రేజు పెరిగిందే కానీ త‌గ్గ‌లేదు. ఇప్పుడు `విశ్వ‌రూపం 2` అదే తీరుగా బంప‌ర్‌హిట్ కొడుతుంద‌న్న అంచ‌నా లేర్ప‌డ్డాయి. ఇప్ప‌టికే రిలీజైన `విశ్వ‌రూపం 2` ట్రైల‌ర్ అద్భుతంగా ఉంద‌న్న ప్ర‌శంస‌లు ద‌క్క‌డంతో ఈ సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. ఈ క్రేజీ సినిమా రిలీజ్ కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కాభిమానులు అంతే ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

User Comments