రెడ్ వైన్ వ‌ద్దు స్కాచ్ ముద్దు అంద‌ట‌

రంగుల ప్ర‌పంచంలో వింత అల‌వాట్లు అని తీసి పారేయ‌క‌పోతే.. అక్కడ ఎన్నో వింత వింత‌లు ద‌ర్శ‌న‌మిస్తుంటాయి. ఇక్క‌డ న‌టీన‌టులు ఒక‌సారి కెరీర్ ప‌రంగా సెట్ట‌యితే ల‌గ్జ‌రీ లైఫ్ కి కొద‌వేమీ ఉండ‌దు. రోజుకు రూ.4-5 వేల మినిమం పారితోషికం అంటే పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. ఆ మాత్రం నేము ఫేము వ‌చ్చేస్తే సీరియ‌ల్ న‌టి అయినా ఆ రేంజులోనే సంపాదించేందుకు ఆస్కారం ఉంటుంది. అయితే అంత సంపాదిస్తే.. నెల‌కు క‌నీసం ల‌క్ష‌న్న‌ర ఆదాయం వ‌స్తుంటే అందుకు త‌గ్గ‌ట్టే హ్యాబిట్స్ కూడా అంతే కాస్ట్ లీగా ఉంటాయి సుమీ.

రెగ్యుల‌ర్ గా త‌న గ‌ర్ల్స్ గ్యాంగ్ తో నైట్ మందు పార్టీలు చేసుకునే ఆ సీరియ‌ల్ ఆంటీ ఈసారి ఎందుక‌నో రెడ్ వైన్ వ‌ద్దు.. ఓన్లీ స్కాచ్ మాత్ర‌మే ప్లీజ్ అనేసింద‌ట‌. ఆవిడ కోరిక‌ను మ‌న్నించి కార్ లో వెళ్లి అదిరిపోయే బ్రాండ్ల‌ను తెచ్చార‌ట ఇత‌ర స్నేహితురాళ్లు. వాళ్ల వ‌ర‌కూ హిమ‌చ‌ల్ ప్ర‌దేశ్ ఆపిల్ బ్రాండ్ వైన్ ని .. సులా రెడ్ వైన్ బ్రాండ్ల‌ను తెచ్చుకుని ఆవిడ‌గారి కోసం ఖ‌రీదైన స్కాచ్ బాటిళ్లు మాత్ర‌మే తెచ్చార‌ట‌. అన్న‌ట్టు స్కాచ్ లు విస్కీలు ఓడ్కాలు అంటే ఇటీవ‌లి కాలంలో లేడీ ఆర్టిస్టుల‌కు కొత్తేమీ కాదు కానీ.. ఆవిడ‌గారు మాత్రం ఒక‌టి కాదు రెండు ఫుల్‌ స్కాచ్ లు లాగించేసి అంద‌రికీ షాకిచ్చింద‌ట‌. ఇంత‌కీ ఆవిడెవ‌రు? అంటూ అడ‌గొద్దు ప్లీజ్. పేరున్న సీరియ‌ల్ న‌టి. ప్ర‌స్తుతం లైవ్ లో ఉన్న సీరియ‌ళ్లే లెండి! వీలుంటే క‌నుక్కోండి చూద్దాం.