పవన్కి పారితోషికం లేదు

స్టార్ హీరోల కాల్షీట్లు దొరకడమే గగనం. వాళ్ల కోసం నిర్మాతలు క్యూ కడుతుంటారు. అడ్వాన్సులతో ముంచెత్తుతుంటారు. ఇక పవన్కళ్యాణ్లాంటి కథానాయకుడి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన ఊ అంటే చాలు… కోరినంత పారితోషికం ఇవ్వడానికి రెడీ అయిపోతారు నిర్మాతలు. రెండు మూడేళ్ల తర్వాత చేస్తానని చెప్పినా అడ్వాన్సులు ముట్టజెప్పేందుకు సై అనేస్తారు. అలాంటి హీరోకి ఈసారి పారితోషికమే లేదట. అదెలా అంటారా? లాభాల్లో వాటా తీసుకుంటానని చెప్పాడట.

`పింక్` రీమేక్కి ఆయన పారితోషికమే మాట్లాడుకున్నప్పటికీ, ఆ తర్వాత చేయబోయే క్రిష్ సినిమాకి మాత్రం లాభాల్లో వాటా పుచ్చుకోబోతున్నాడట. అది పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కబోతున్న చిత్రం. అందులో రిస్క్ ఎంత ఉంటుందో, లాభాలొచ్చినా అదే స్థాయిలో ఉంటాయి. అందుకే అటు నిర్మాతలకి భారం కాకుండా పవన్ లాభాలొచ్చాక అందులో వాటా తీసుకుంటానని చెప్పాడట. ఇది మంచి నిర్ణయమే. చిరంజీవి కూడా మొన్న జరిగిన వేడుకల్లో తాను సినిమా పూర్తయ్యాకే పారితోషికం తీసుకుంటుంటానని చెప్పాడు. సో.. అన్న బాటలోనే తమ్ముడు ప్రయాణం చేయబోతున్నాడన్నమాట.