డ్యాన్స్ లు పాటలా.. నో అంటున్న రానా

మన ఇండియన్ సినిమాల్లో తప్ప మిగతా దేశాల్లోని సినిమాల్లో పాటలు కనిపించవు. అక్కడ పాటలను విడిగా ఆల్బమ్ రూపంలో విడుదల చేస్తారు.

మన సినిమాల్లోనే ఇలా పాటలు డ్యాన్స్ లు ఉంటాయని చాలామందికి తెలుసు. అయితే ఇలా ఉంటడం తప్పుకాదు.

కానీ, కథ బలంగా నడుస్తున్నప్పుడు సడెన్ గా కొన్ని పాటల వలన గాడి తప్పే అవకాశం ఉంటుంది.  ఇదే విషయాన్ని ఇప్పుడు యంగ్ స్టార్ హీరో, మన భల్లాలదేవుడు రానా కూడా చెప్తున్నాడు.

తనకు సినిమాల్లో పాటలు, డ్యాన్స్ లు నచ్చవని అంటున్నాడు.

అయితే, మన సినిమాలో ఇప్పుడు అవి ఒక భాగం అయిపోయాయనే విషయాన్ని మర్చిపోకూడదు. ఇక కొందరు అయితే వాటికోసమే సినిమా చూస్తుంటారు.

అందుకే మన మేకర్స్ కూడా కథ రాసుకున్నప్పుడే పాటలకు, డ్యాన్సులకు, ఫైట్లకు పక్కాగా ప్రాధాన్యత ఇచ్చేస్తూ ఉంటారు.

ఇకపోతే, నేనేరాజు నేనే మంత్రి సినిమా అందరూ అనుకుంటున్నట్టుగా పూర్తి స్థాయి రాజకీయ చిత్రం కాదట.  ఒక బలమైన కారణం వలన ఓ సామాన్యుడు పంతం పట్టి ఎలా రాజకీయ నాయకుడిగా ఎదిగాడో ఇందులో చూపించారట.

జోగేంద్ర, రాధాల మధ్య ప్రేమ ఎలా ఉంటుంది అనే విషయాన్ని తేజ ఇందులో అద్భుతంగా చూపించారని అంటున్నారు రానా.

అంతేకాదు, సినిమాలో ప్రతి సన్నివేశం ఈ రెండు పాత్రల చుట్టూనే తిరుగుతుందని అంటున్నాడు.

రాధా వంటి పాత్రలు అరుదుగా వస్తుంటాయని, కాజల్ అద్భుతంగా నటించిందని అంటున్నాడు జోగేంద్ర అలియాస్ రానా.

మరి రానా చెబుతున్నట్లు ఈ సినిమా అద్భుతంగా  ఉండటం సరే.. ఫ్యూచర్ లోనైనా తనకు నచ్చినట్లు పాటలు, డ్యాన్సులు లేకుండా ఏదైనా ఒక ప్రయోగంతో కూడిన సినిమా చేస్తాడేమో చూడాలి.

అయినా, అది మన హీరోలకు చెప్పినంత వీజీ కాదేమో.

Follow US