సెల్వ‌ స‌ర్‌తో అంత‌ ఈజీ కాదు: ర‌కుల్

Last Updated on by

ఎక్స్ ప్రెస్ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్ మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చేసింది. కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. గ‌తేడాది గ్యాప్ తో నిరాశ ప‌రిచినా కొత్త సంవ‌త్స‌రం మాత్రం ఆరంభం అద‌ర‌గొ ట్టింది. ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ్, హిందీ సినిమాలతో బిజీ. టాలీవుడ్ కాక‌పోతే కోలీవుడ్ అదీ కుద‌ర‌క పోతే బాలీవుడ్ అంటూ కాన్పిడెంట్ గా ఉంది. ఇక మే 31న సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో సూర్య స‌ర‌స‌న న‌టించిన ఎన్ జీకే భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌ల‌వుతోంది . తెలుగులో ఈ చిత్రాన్ని కె.కె. రాధామోహ‌న్ విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఎన్జీకే విశేషాల‌ను ర‌కుల్ మీడియాతో పంచుకుంది. ఆవేంటో ఆమె మాట‌ల్లోనే..

పొలిటికల్‌ థ్రిల్లర్‌ మూవీ ఇది. వానతి అనే ఇండిపెండెంట్, ప‌వ‌ర్‌ఫుల్ ఉమెన్ క్యారెక్టర్‌ చేశాను. ఇలాంటి క్యారెక్టర్‌ నేను ఇంతవరకు చేయలేదు. హీరో క్యారెక్టర్‌ పాలిటిక్స్‌లోకి వస్తున్నప్పుడు హీరోయిన్లుగా నేను, పల్లవి ఏం చేశామన్నది ఆస‌క్తిక‌రం. ఇలాంటి క్యారెక్టర్‌ నేను ఇంతవరకు చేయలేదు. సూర్య మంచి కో–స్టార్‌. మంచి ప్రతిభాశాలి. సాయిపల్లవి టాలెంటెడ్‌ యాక్టర్‌. హీరో క్యారెక్టర్‌ పాలిటిక్స్‌లోకి వస్తున్నప్పుడు హీరోయిన్లుగా నేను, పల్లవి ఏం చేశామన్నది కథలో కీలకం. చాలా సినిమాలు చేసిన తర్వాత సెట్‌లో ఓ ధోరణికి అలవాటు పడిపోతాం. కానీ సెల్వసార్‌ సెట్‌లో అలా ఉండదు. ఒకవేళ మనం ఏదైనా హోమ్‌వర్క్‌ చేసి ఓ మైండ్‌ సెట్‌తో సెట్‌లోకి వెళితే అంతా క్యాన్సిల్‌. అక్కడ అంతా కొత్తగా ఉంటుంది. ఎందుకంటే హోమ్‌వర్క్‌ అంతా సెల్వసార్‌ చేసేస్తారు. యాక్టర్స్‌ పెర్ఫార్మెన్స్‌ పట్ల ఆయన ఫుల్‌ క్లారిటీగా ఉంటారు. మల్టీఫుల్‌ థింగ్స్‌ని బ్రెయిన్‌లో పెట్టుకుని యాక్ట్‌ చేయాలి. సెల్వసార్‌తో వర్క్‌ చేయడం కొత్త ఎక్స్‌పీరియన్స్‌. యాక్ట ర్‌గా మరింత ఇంప్రూవ్‌ కావొచ్చు. సినిమా మంచి విజ‌యం సాధిస్తుంన్న న‌మ్మ‌కం ఉంది.

సినిమా అంతా ఒక హీరోయిన్‌ ఉంటేనే ఉమెన్‌ సెంట్రిక్‌ సినిమాలు కాదు. ‘రారండోయ్‌ వేడుక చూద్దాం, జయ జానకి నాయక, దే దే ప్యార్‌ దే’ సినిమాల్లో హీరోయిన్‌ పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంది. బయోపిక్‌ చాన్స్‌ వస్తే నేను తప్పకుండా చేస్తాను. బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌ బయోపిక్‌లో నటించాలనుకున్నాను. కాస్టింగ్‌ అయిపోయింది. కొత్త కాన్సెప్ట్‌ ఉన్న వెబ్‌ సీరిస్‌లో నటించడానికి రెడీ. ప్రస్తుతం నాగార్జునగారి ‘మన్మథుడు 2’ సినిమా చేస్తున్నాను. హిందీలో చేసిన ‘మర్జవాన్‌’ సినిమా అక్టోబర్‌లో విడుదల కానుందని తెలిపారు.