బోటు ఇప్ప‌ట్లో రాన‌ట్లే

క‌చ్చులూరు వ‌ద్ద గోదావ‌రి లో మునిగిపోయిన బోటు తీసే ప్ర‌య‌త్నాలు ప్ర‌భుత్వం విర‌మించికున్న‌ట్లు తెలుస్తోంది. బోటును గుర్తించిన బ‌య‌ట‌కు తీసే ప‌రిస్థితులు లేని నేప‌థ్యంలో నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా కేంద్ర హోంశాఖ స‌హాయ‌మంత్రి జి.కిష‌న్ రెడ్డి కూడా ఇదే విష‌యాన్ని చెప్పారు. బుర‌ద మ‌ట్టి, ఇసుక‌లో బోటు కూరుకుపోయి ఉంటుంది. గ‌ల్లంతైన వారు అందులో ఉండొచ్చు. వ‌ర‌ద ఉదృతి ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో వెలికి తీసే అవ‌కాశం లేద‌ని ఆయ‌న తెలిపారు.

అయితే మృతదేహాల వెలికితీత‌పై యంత్రాంగం దృష్టిపెట్టింది. కేంద్రం నుంచి ఎటువంటి సాంకేతిక సాయం కావాల‌న్నా అందివ్వ‌డానికి సిద్దంగా ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని, టూరిజం నిబంధనలు కఠినంగా ఉండాలన్నారు. ప్రైవేట్‌ బోటైనా, టూరిజం బోటైనా, ప్రభుత్వ సర్వీసు బోటైనా నిబంధనలు ఒకేలా ఉండాలన్నారు. బోటు ప్రమాదంపై డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కలెక్టర్‌ డి.మురళీధరరెడ్డి, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, కోస్ట్‌గార్డ్‌, పోలీసు అధికారులతో ఆయన సమీక్షించారు.