Last Updated on by
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా – నోటా. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించారు. స్టూడియోగ్రీన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మించారు. తెలుగు, తమిళ్లో ఈనెల 5న ఈ చిత్రం రిలీజవుతోంది. కోర్టు వివాదాల నడుమ అన్నిటినీ పరిష్కరించుకుని రిలీజ్ చేస్తున్నామని నేడు హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్‌లో జరిగిన మీడియా సమావేశంలో దేవరకొండ స్వయంగా వెల్లడించారు.
ఈ సినిమాలో యంగ్ సీఎం పాత్రలో నటిస్తున్నారు కదా? ఆ పాత్ర గెటప్, ఆహార్య ం కోసం ఎవరిని ఇమ్మిటేట్ చేశారు? అన్న ప్రశ్నకు దేవరకొండ సమాధానం ఇస్తూ.. ఇది చెప్పొద్దో కూడదో.. యంగ్ మినిస్టర్ కేటీఆర్‌ని ఇమ్మిటేట్ చేశాను. ఆయన రూపం, ఆహార్య ం, డ్రెస్సింగ్ సెన్స్ ప్రతిదీ ఇమ్మిటేట్ చేశాను.. అని తెలిపారు. కేటీఆర్ గారి తరహాలో ఉన్న ఫోటోల్ని తొందర్లోనే బయటపెడతాను. నేను పర్సనల్‌గా ఆయన లుక్‌ని పరిశీలించి అనుసరించాను. ఖాదీ వస్త్రధారణ కూడా అనుసరించాను.. ప్రతిదీ రిఫరెన్సులు పరిశీలించాను. స్టైలింగ్ విషయంలో ఆయన ఫోటోలు చూశాను.. అని తెలిపారు. పర్సనల్‌గానూ కేటీఆర్‌ని అభిమానిస్తాను.. అని తెలిపారు. మీకు నచ్చే సీఎం ఎవరు? అని ప్రశ్నిస్తే… నాకు నచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని తెలిపారు. ఆయన హయాంలోనే హైదరాబాద్ నగరానికి భూమ్ వచ్చింది. చంద్రబాబు లీడర్‌షిప్‌లోనే క్రమశిక్షణ అనేదానిపైనా ఆసక్తికరంగా చర్చ సాగింది. ఆయన రూల్స్‌కి ప్రభుత్వోద్యోగులు విసుక్కోవడం, ఆ తర్వాత సంగతులు అందరికీ తెలుసు… అనీ అన్నారు. సంఘంలో రాజకీయ అవినీతి గురించి పూర్తిగా ఉండదు కానీ, కొంతవరకూ దానిపైనే సినిమా రన్ అవుతుంది. ది బెస్ట్ రీరికార్డింగ్ కుదిరిన చిత్రమిది అన్నారు. ఇందులో జయలలిత అవినీతి గురించి ఏమైనా చర్చించారా? అంటే రేపు సినిమా చూస్తే మీకే తెలుస్తుంది అని సమాధానమిచ్చారు.
User Comments