`నోటా` న‌ష్టాలు ఎంత‌?

Last Updated on by

విజ‌య్ దేవ‌ర‌కొండ `నోటా` న‌ష్టాలు ఎంత‌? నిర్మాత జ్ఞాన‌వేల్ రాజా వేసిన స్కెచ్ పారిందా లేదా? ఇదే ప్ర‌శ్న అడిగితే పంపిణీదారు విశ్వేశ్వ‌ర‌రావు షాకిచ్చే నిజాల్ని వెల్ల‌డించారు. ఓ ప్ర‌ముఖ ఆంగ్ల ప‌త్రిక‌కు ఇచ్చిన వివ‌రాల ప్ర‌కారం..

నోటా చిత్రాన్ని కేవ‌లం 12కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించారు. ఆ త‌ర్వాత ప‌బ్లిసిటీ వ‌గైరా వ్య‌వ‌హారాల కోసం మ‌రో 4కోట్లు అద‌నంగా ఖ‌ర్చ‌యింది. అయితే రిలీజ్ ముందే దేవ‌ర‌కొండ వ‌రుస స‌క్సెస్‌ల ట్రాక్ రికార్డు చూసి పంపిణీదారులు భారీగా ఆఫ‌ర్ చేశారు. ఏపీ – 12కోట్లు, నైజాం -4కోట్లు, సీడెడ్ – 2కోట్లు చెల్లిస్తామ‌న్నారు. కానీ జ్ఞాన‌వేల్ త‌నే సొంతంగా రిలీజ్ చేసుకోవాల‌నుకుని ఏషియన్ సునీల్ నారంగ్ – యు.వి.క్రియేషన్స్ సాయం తీసుకుని త‌ప్పు చేశార‌ని స‌ద‌రు విశ్వేశ్వ‌ర‌రావు వెల్ల‌డించారు. 18 కోట్ల ప్రీబిజినెస్ ఆఫ‌ర్‌ని వ‌దులుకుని ఇప్పుడు కోట్ల‌లో న‌ష్టం కొని తెచ్చుకుంటున్నార‌ని అన్నారాయ‌న‌. అక్టోబ‌ర్ 11న అర‌వింద స‌మేత రిలీజైతే త‌ర్వాత నోటా చూసేవాళ్లు ఉండ‌నే ఉండ‌ర‌ని అన్నారు.

User Comments