వెబ్ సిరిస్ లో భూమిక‌

Actress Bhumika Latest 2019 Hot Stills - Bhumika Latest Hot Photoshoot

ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగిన భూమిక స్టిల్ ఇంకా సినిమాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. వ‌య‌సుకు త‌గ్గ పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ ఉనికిని చాటుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఆ మ‌ధ్య స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లోన‌టించిన యూ ట‌ర్న్ లో మాయ పాత్ర‌ల క‌నిపించింది. ఆ త‌ర్వాత భూమిక మ‌ళ్లీ తెలుగు సినిమాల్లో క‌నిపించ‌లేదు. అయితే త‌మిళ్ సినిమాల‌తో మాత్ర‌మే బిజీగానే ఉంది. ప్ర‌స్తుతం రెండు కోలీవుడ్ సినిమాల్లో న‌టిస్తోంది. తాజాగా వెబ్ సిరిస్ ల‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. భ‌మ్ర‌ అనే ఓ వెబ్ సిరీస్ లో న‌టించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

ఇందులో క‌ల్కీ క‌చ్లిన్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తోంది. ఆమెపాత్ర‌కు ధీటుగానే భూమిక రోల్ కూడా ఉంటుందిట‌. అలాగే హాట్ హాట్ స‌న్నివేశాల్లోనూ భూమిక క‌నిపించ‌నుంద‌ని అంటున్నారు. ఇంకా సంజ‌య్ సూరి, ఓంకార్ క‌పూర్, ఐజాజ్ ఖాన్ సిరీస్ లో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఎక్కువ భాగంగా సిమ్మ‌లాలో జ‌ర‌గ‌నుందిట‌. ప్ర‌స్తుతం వెబ్ సిరీస‌స్ ల‌దే ట్రెండ్. వీటి ద్వారా ఎంతో మంది ట్యాలెంట్ వెలుగులోకి వ‌చ్చింది. సినిమాలు లేక ఖాళీగా ఉంటోన్న సీనియ‌ర్ల‌కు మంచి వేదిక అవుతోంది.