న‌యా వివాదాల రాణి

Last Updated on by

ఇటీవ‌లే రిలీజై సంచ‌ల‌న విజ‌యం సాధించిన `వీరే ది వెడ్డింగ్‌` చిత్రం గురించి ప్ర‌స్తుతం దేశ‌విదేశాల్లో వాడి వేడిగా చ‌ర్చ సాగుతోంది. పెళ్లి త‌ర‌వాత మ‌గువ స్వేచ్ఛ అన్న హాట్ టాపిక్ జోరుగా వైర‌ల్ అయిపోయింది. ఈ సినిమాలో న‌టీమ‌ణులు క‌రీనాక‌పూర్‌, సోన‌మ్‌క‌పూర్‌, స్వ‌రాభాస్క‌ర్ పెర్ఫామెన్స్ పైనా విస్త్ర‌తంగా చ‌ర్చ సాగుతోంది. కుర్రాళ్ల‌లో ప్ర‌స్తుతం ఇదో హాట్ టాపిక్‌. ఇక‌పోతే ఈ సినిమాలో అంద‌రికంటే ఎక్కువ పేరొచ్చింది స్వ‌రా భాస్క‌ర్‌కి. ఈ భామ బోల్డ్ ఎరోటిక్ గాళ్ పాత్ర‌లో న‌టించింది. పెళ్ల‌యినా అక్ర‌మ సంబంధం పెట్టుకునే మ‌హిళ‌గా న‌టించి షాకిచ్చింది.

ఆ క్ర‌మంలోనే ఆ పాత్ర‌పై అన్ని వైపుల నుంచి నెటిజ‌నుల్లో విమ‌ర్శ‌లు ఎదుర‌య్యాయి. ఈ సినిమాలో ద్వంద్వార్థ సంభాష‌ణ‌లు, బూతు స‌న్నివేశాలు ఉన్నాయి.. అందుకే సెన్సార్ చేయ‌లేమ‌ని పాకిస్తాన్ సీబీఎఫ్‌సీ చేతులెత్తేసింది. అటుపై స్వ‌రా భాస్క‌ర్ పాక్‌పై ఊహాతీత‌మైన కామెంట్స్‌ని చేసింది. పాకిస్తాన్ ఓ వైఫ‌ల్యం చెందిన కంట్రీ. సెక్యుల‌రిజం .. మూఢ‌త్వం ఉన్న దేశం. ఆ దేశాన్ని ఎవ‌రూ ప‌ట్టించుకోవాల్సిన ప‌నే లేదు.. అంటూ తీవ్ర‌మైన వ్యాఖ్య‌ల్ని చేసింది. దీనిపై పాకిస్తానీ న‌టి ఒక‌రు కౌంట‌ర్ వేయ‌డంపైనా చ‌ర్చ సాగుతోంది. మొత్తానికి ఈ వివాదం వ‌ల్ల స్వ‌రా పేరు బాలీవుడ్ స‌హా ప్ర‌పంచ‌వ్యాప్తంగా మార్మోగిపోతోంది. తాజాగా ఈ భామ ఓ మ్యాగ‌జైన్ క‌వ‌ర్‌పేజీకి మ‌తి చెడే లెవ‌ల్లో ఫోజులివ్వ‌డం యూత్‌లో హాట్ టాపిక్ అయ్యింది.

User Comments