20 సెక‌న్లు బ‌న్ని స్నేక్‌డ్యాన్స్‌

Last Updated on by

బ్రేక్ డ్యాన్సులు.. షేక్ డ్యాన్సులు చేయాలంటే అప్ప‌ట్లో చిరంజీవి గురించి చెప్పుకునేవారు. ఇప్పుడు ఆ త‌ర‌హా డ్యాన్సులు చేయ‌డంలో మెగా కాంపౌండ్ హీరోలు ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతున్నారు. చ‌ర‌ణ్‌, బ‌న్ని, సాయిధ‌ర‌మ్ .. ఈ ముగ్గురూ ఎవ‌రికివారు డ్యాన్సుల్లో యూనిక్‌. మెగా హీరోలు కాకుండా ఆ స్థాయిలో తార‌క్ ఒక్క‌డే డ్యాన్సులు చేయ‌గ‌ల‌డ‌న్న డిబేట్ న‌డుస్తుంటుంది. అదంతా స‌రే.. ఇప్పుడు ఈ ప్రోమోలో బ‌న్ని స్టెప్పులు చూశాక అస‌లు టాలీవుడ్ నంబ‌ర్ -1 డ్యాన్స‌ర్ ఎవ‌రు అంటే బ‌న్ని అని అంగీక‌రించాల్సిందే. అత‌డు వేసిన‌ప్ర‌తి స్టెప్పు మైండ్ బ్లోయింగ్. పాశ్చాత్య నృత్యాల్ని, బాడీ లాంగ్వేజ్‌లో ఆ స్వింగును అస‌లు టాలీవుడ్‌కి ప‌రిచ‌యం చేసిందే బ‌న్ని. ఆర్య సినిమాతో ఆ ట్రెండ్ సృష్టించాడు. అటుపై ఆర్య‌-2లో ప‌రాకాష్ట‌కు తీసుకెళ్లాడు. ఆ త‌ర‌వాత ప్ర‌తి సినిమాలోనూ స్ప్రింగులా సాగే డ్యాన్సుల‌తో అట్టుడికించాడు. అల్లాడించ‌డం.. కేక పెట్టించ‌డం.. .ర‌చ్చ ర‌చ్చ చేయడం బ‌న్నికే చెల్లింది.

లేటెస్టుగా రిలీజ్ చేసిన `నా పేరు సూర్య` 20 సెక‌న్ల ప్రోమోలోనూ బ‌న్ని ఇర‌గ‌దీసేశాడు. “అట్ట సూడ‌కే.. కొట్టిన‌ట్టుగా అట్ట సూడ‌కే… సిట్టిగుండెకే.. గురిపెట్ట‌కె తుపాకి.. “ అంటూ అనూ ఇమ్మాన్యుయేల్ వెంట‌ప‌డుతూ అత‌డు వేసిన స్టెప్పులు అద్భుతంగా కుదిరాయి. మ‌రోసారి బ‌న్ని త‌న‌దైన మార్క్ చూపించేందుకు ప్ర‌య‌త్నించాడు. ఎప్ప‌టిక‌ప్పుడు డ్యాన్సుల్లో కొత్త ద‌నం ప్ర‌య‌త్నిస్తేనే స్టార్‌డ‌మ్ నిల‌బెట్టుకునే స‌న్నివేశం క‌నిపిస్తోందిప్పుడు. ఈ ప్రోమోలో అత‌డు హ్యాట్‌ని గిర‌గిరా తిప్పుతూ .. గాల్లోకి ఎగ‌ర‌వేస్తూ చేసిన విన్యాసాలు సంథింగ్ స్పెష‌ల్ అనే చెప్పాలి.

User Comments