చుక్క‌ల్లో ఎన్టీఆర్28 ఓవ‌ర్సీస్‌

Last Updated on by

ఎన్టీఆర్ స్టార్‌డ‌మ్ ముందు ఓట‌మి వెల‌వెల‌బోతుంద‌ని, ట్రేడ్ అల్టిమేట్‌గా షేక‌వుతుంద‌ని నిరూపిస్తోంది ఈ బిజినెస్ డీల్‌. అస‌లింత‌కీ ఏమా డీల్‌? అంటే ఎన్టీఆర్ హీరోగా న‌టిస్తున్న 28వ సినిమా ఓవ‌ర్సీస్ హ‌క్కుల్ని ఏకంగా 18కోట్ల‌కు విక్ర‌యించార‌న్న‌దే ఓ షాకింగ్ అప్‌డేట్‌. ఆ మేర‌కు హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ – సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత రాధాకృష్ణ డీల్ పూర్తి చేశార‌ని తెలుస్తోంది. రాధాకృష్ణ నిర్మించిన గ‌త చిత్రం `అజ్ఞాత‌వాసి` డిజాస్ట‌ర్ ఫ‌లితం అందుకున్నా.. ప్ర‌స్తుత డీల్ షాకిచ్చే లెవ‌ల్లో ఉంద‌న్న టాక్ వినిపిస్తోంది. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ఓ చెత్త సినిమా తీశాడ‌ని `అజ్ఞాత‌వాసి`ని విమ‌ర్శించినా ఆ ప్ర‌భావం తాజా చిత్రంపై ప‌డ‌క‌పోవ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

అయితే సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత రాధాకృష్ణ ఎన్టీఆర్ 18 బిజినెస్ పూర్తి చేసేందుకు ఈసారి తెలివైన లాజిక్‌ని వాడార‌ట. ఎన్టీఆర్ సినిమాతో పాటు, నాగ‌చైత‌న్య‌- మారుతి `శైల‌జా రెడ్డి అల్లుడు`, శ‌ర్వానంద్ – సుధీర్ వ‌ర్మ తాజా సినిమాల‌తో క‌లిసి బిజినెస్ పూర్తి చేశార‌ట‌. పైగా `అజ్ఞాత‌వాసి` న‌ష్టాల్లో 20శాతం భ‌రించేందుకు రాధాకృష్ణ భ‌రోసా ఇవ్వ‌డం తాజా బిజినెస్‌కి సాయ‌మైంది. ఇక వేరొక కోణంలో చూస్తే… ఎన్టీఆర్ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ అన్న టాక్ వినిపిస్తే చాలు ఓవ‌ర్సీస్‌లో సునాయాసంగా 3 మిలియ‌న్ డాల‌ర్ వ‌సూళ్లు సాధ్య‌మే. ఇదివ‌ర‌కూ ఎన్టీఆర్ న‌టించిన `నాన్న‌కు ప్రేమ‌తో`, `జ‌న‌తా గ్యారేజ్‌` చిత్రాలు ఓవ‌ర్సీస్‌లో చ‌క్క‌ని వ‌సూళ్లు సాధించాయి. ఆ క్ర‌మంలోనే తార‌క్ 28వ సినిమాకి ఇంత పెద్ద బిజినెస్ జ‌రిగింద‌ని విశ్లేషించ‌వ‌చ్చు. `రంగ‌స్థ‌లం`, `భ‌ర‌త్ అనే నేను` చిత్రాలు ఓవ‌ర్సీస్‌లో సాధించిన వ‌సూళ్లు ఈ బిజినెస్‌కి బూస్ట్ ఇచ్చాయ‌ని చెప్ప‌వ‌చ్చు.

User Comments