`అర‌వింద స‌మేత` డే1 వ‌సూల్‌

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన `అర‌వింద స‌మేత‌` డే1 బాక్సాఫీస్ వ‌ద్ద అద‌ర‌గొట్టేసింది. ఈ సినిమా తొలిరోజు పాజిటివ్ బ‌జ్ రావ‌డంతో ఆ మేర‌కు వ‌సూళ్ల‌కు అది క‌లిసొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ఏకంగా 26.64కోట్ల షేర్ వ‌సూళ్ల‌తో సంచ‌ల‌నం సృష్టించింది. వీర‌రాఘ‌వుని ఎమోష‌నల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ హ‌వా జ‌నాల‌కు న‌చ్చ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద  నాన్ బాహుబ‌లి రికార్డ్ సాధ్య‌మైంది.
ఏపీ-తెలంగాణ వ‌సూళ్ల గ‌ణాంకాలు ప‌రిశీలిస్తే.. నైజాం- 5.73కోట్లు, నెల్లూరు -1.06 కోట్లు, సీడెడ్ -5.48 కోట్లు, గుంటూరు-4.14కోట్లు, కృష్ణ‌- 1.97కోట్లు, తూ.గో జిల్లా- 2.77కోట్లు, ప‌.గో.జిల్లా-2.37కోట్లు, ఉత్త‌రాంధ్ర -3.12 కోట్లు క‌లుపుకుని ఓవ‌రాల్‌గా 26.64కోట్ల షేర్‌ వ‌సూళ్ల ల‌క్క తేలింది. ఇక అమెరికాలోనూ దాదాపు 6కోట్ల వ‌సూళ్లు సాధించిన సంగ‌తి తెలిసిందే.

User Comments