కొత్త హీరోకి తార‌క్ బూస్ట్‌

Last Updated on by

దాదాపు 500 పైగా చిత్రాల‌కు ఫైట్స్‌ని కొరియోగ్రాఫ్ చేసిన అనుభ‌వ‌జ్ఞుడు ఫైట్ మాష్ట‌ర్ విజ‌య్‌. అత‌డి వారసుడు అరుణ్ విజ‌య్ హీరోగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. అరుణ్ న‌టించిన తొలి సినిమా `ఈ మాయ పేరేమిటో` ఆడియో ఈవెంట్ నిన్న‌టి సాయంత్రం హైద‌రాబాద్‌లో గ్రాండ్‌గా జ‌రిగింది. ఈ ఈవెంట్‌లో ముఖ్య అతిధి తార‌క్ ఓ రేంజులో యువ‌హీరోకి బూస్ట్ ఇవ్వ‌డం చ‌ర్చ‌కొచ్చింది. విజ‌య్ కోసం ఏకంగా తార‌క్ అభిమానులంతా ఈవెంట్‌కి హాజ‌ర‌య్యారు. ఈవెంట్ ఆద్యంతం ర‌క్తి క‌ట్టించారు.

ఆడియోలో విజయ్ మాస్టార్‌ని ఓ రేంజులో పొగిడేసిన తార‌క్‌.. అరుణ్ విజ‌య్ పెద్ద హీరోగా ఎద‌గాల‌ని ఆకాంక్షించాడు. విజ‌య్ మాష్ట‌ర్ తెర‌వెన‌క హీరోగా ఎన్నో సినిమాల‌కు రిస్కీ ఫైట్స్ అందించారు. అస‌లు టెక్నాల‌జీ లేని రోజుల్లోనే ఆయ‌న ఎంతో రిస్క్ చేసి ఫైట్స్ కొరియోగ్రాఫ్ చేశార‌ని, దెబ్బ‌లెన్నో తిన్నార‌ని అన్నారు. విజ‌య్‌- సుమ‌తి జంట ప్రేమ‌వివాహం చేసుకుని బంగారం లాంటి పిల్ల‌ల్ని క‌న్నార‌ని, ఆ ఇద్ద‌రి పుణ్య‌ఫ‌ల‌మే విజ‌య్ అని పొగిడేశాడు. విజ‌య్ మాస్టార్ పైకి ఎంత క‌ఠినంగా క‌నిపించినా, ఎంతో సున్నిత మ‌న‌స్కుడ‌ని త‌న‌ని ద‌గ్గ‌ర‌గా చూసిన‌వాడిగా తార‌క్ చెప్పారు. త‌న‌కు ఫైట్స్‌లో ఓన‌మాలు నేర్పించి, ఏది రిస్కో, ఎక్క‌డ‌ జాగ్ర‌త్త‌గా ఉండాలో నేర్పించార‌ని మాష్టార్‌పై ఓ రేంజులో తార‌క్ అభిమానం చూపించాడు. ఇక అరుణ్ విజ‌య్‌కి నంద‌మూరి అభిమానుల అండ‌దండ‌లు ఉంటాయ‌ని దీనిని బ‌ట్టి అర్థ‌మైంది. డెబ్యూ సినిమా `ఈ మాయ పేరేమిటో` ట్రైల‌ర్‌లో అరుణ్ ఫైట్స్ మైండ్ బ్లోవింగ్‌. ఆ సంగ‌తిని ట్రైల‌ర్ చెబుతోంది. ఇక ఇత‌ర విభాగాల్లోనూ బాగా సుశిక్షితుడై బ‌రిలో దిగాడ‌ని అర్థ‌మ‌వుతోంది. ఆల్ ది బెస్ట్ టు డెబ్యూ హీరో.

User Comments